మనమూ అక్కడకు పోదాం.. ఫ్రాన్స్‌లో నిరసనలపై ట్రంప్ ఎద్దేవా
ABN , Publish Date - Oct 18 , 2026 | 02:02 PM
హింసాత్మక నిరసనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు పేల్చారు. ఫ్రాన్స్ సుందరమైన దేశమని, ఎలాంటి తిరుగుబాట్లు, లూటీలు ఉండవని ఎద్దేవా చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: హింసాత్మక నిరసనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు పేల్చారు. ఫ్రాన్స్ సుందరమైన దేశమని, ఎలాంటి తిరుగుబాట్లు, లూటీలు ఉండవని ఎద్దేవా చేశారు. యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల కెంటకీ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వబోయే 5 వేల డాలర్ల గురించి మాట్లాడుతూ ఫ్రాన్స్ ప్రస్తావన కూడా తెచ్చారు.
‘నేనిచ్చే 5 వేల డాలర్లతో ఫ్రాన్స్‌కు వెళ్లవచ్చు. అది చాలా సుందరమైన ప్రాంతం. విప్లవాలు, తిరుగుబాట్లు ఏవీ ఉండవు’ అంటూ ఫ్రాన్స్‌లో తాజా పరిస్థితుల గురించి ట్రంప్ ఎద్దేవా చేశారు. ‘పదండి ఫ్రాన్స్‌కు వెళదాము. విప్లవకారులతో చేతులు కలుపుదాము. విప్లవాలకు ఫ్రాన్స్ సహజసిద్ధమైన స్థానం. అక్కడి పరిస్థితులు నమ్మలేనట్టుగా ఉన్నాయి’ అని మరో సెటైర్ పేల్చారు.
మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను పాశ్చాత్య ఉదారవాదులు ప్రోత్సహించడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. కారుణ్యం, మానవత్వం పేరిట వలసలను ప్రోత్సహించారని అన్నారు. పాశ్చాత్య సమాజంలో వారు ఇమడగలరా? ఇక్కడి సంస్కృతికి వారు తగిన వారేనా? అన్న విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ వార్తలనూ చదవండి:
అలా అనుండాల్సింది కాదు.. ‘నిర్బంధ సేవకుల’ కామెంట్స్‌పై వాన్స్ వివరణ
అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు