Share News

అలా అనుండాల్సింది కాదు.. ‘నిర్బంధ సేవకుల’ కామెంట్స్‌పై వాన్స్ వివరణ

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:11 PM

పర్మ్ ప్రోగ్రామ్ నుంచి భారత ఐటీ కంపెనీల తొలగింపు నేపథ్యంలో తను చేసిన వ్యాఖ్యలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కు తగ్గారు.

అలా అనుండాల్సింది కాదు.. ‘నిర్బంధ సేవకుల’ కామెంట్స్‌పై వాన్స్ వివరణ
JD Vance on Indentured Servitude

ఇంటర్నెట్ డెస్క్: పర్మ్ ప్రోగ్రామ్ నుంచి భారత ఐటీ కంపెనీల తొలగింపు నేపథ్యంలో తను చేసిన వ్యాఖ్యలపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనక్కు తగ్గారు. అలా అనుండాల్సింది కాదని అన్నారు. తన వైపు నుంచి పొరపాటు జరిగిందని అన్నారు. హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అమెరికన్లకు దక్కాల్సిన జాబ్స్‌ను కొన్ని కంపెనీలు హెచ్-1బీ వీసా సాయంతో నిర్బంధ కార్మికులకు ఇస్తున్నాయని అన్నారు. ఈ కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ కూడా ఈ కామెంట్స్‌పై సూటిగా స్పందించింది. భారత్‌లో వలసపాలకుల చరిత్ర దృష్ట్యా ఇలాంటి పదజాలం ఆమోదం కాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వాన్స్ తాజాగా వెనక్కు తగ్గారు.


‘ఆ విషయంలో నా వ్యాఖ్యలు సరిగా లేవనే మాట నిజం. అది నా పొరపాటే. కానీ నేను అన్న వ్యాఖ్యలు కొందరికే వర్తిస్తాయి. అందరికీ కాదు. హెచ్-1బీ వీసాతో వారు వస్తారు. అలాంటి వర్కర్లు అమెరికాలో దొరకరని కంపెనీలు సర్టిఫై చేస్తాయి. చివరకు అమెరికాలో విదేశీయులకు వీసానే జీవనాధారంగా మారుతుంది. అలాంటప్పుడు జరిగేది ఇదే’ అని వాన్స్ అన్నారు.


‘కాబట్టి నేను నిర్బంధ సేవ అని అన్నానంటే అది వీసాహోలర్డర్లను ఉద్దేశించి కాదు. కంపెనీలను ఉద్దేశించి. వీసాతో అమెరికాకు వచ్చిన వారు ఇక్కడ కంపెనీలోని పైఅధికారులతో విభేదిస్తే జాబ్ కోల్పోవాల్సి వస్తుంది. ఇండియాకు తిరిగి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది కంపెనీలకే ప్రయోజనకరంగా మారుతోంది. వాటి ఆధిపత్యం పెరుగుతోంది. కానీ ఈ విషయంలో నేను వాడిన పదజాలం సరిగ్గా లేకపోవచ్చు. కానీ ప్రజలను నిర్బంధ సేవకులుగా మార్చిన వీసా వ్యవస్థపైనే నేను విమర్శలు ఎక్కుపెట్టాను’ అని ఆయన వివరించారు.


ఈ వార్తలనూ చదవండి:

అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు

చేతిలో పిస్టల్‌తో డ్రగ్స్ స్థావరంపై దాడి.. బంగ్లాదేశ్ మంత్రి వీడియో వైరల్..

Updated Date - Oct 18 , 2026 | 01:33 PM