ఫోన్ దిండు కిందే పెట్టుకుని నిద్ర పోతున్నారా..? అయితే ప్రమాదమే!
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:18 PM
నిద్రించే సమయంలో ఫోన్ దిండు కిందే పెడుతున్నారా..? అయితే ఆ అలవాటు వెంటనే మానుకోవాలంటున్నారు నిపుణులు.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజుల్లో సెల్‌ఫోన్ ఆరో ప్రాణం లాంటిదని ఊరికే అనలేదు. నిద్రలేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రపోయే వరకూ చాలామంది ఫోన్‌ను వదలరు. కొందరైతే నిద్రలో కూడా వదలరు. దాన్ని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తారు. దీని వల్ల ఎప్పుడూ మొబైల్ అందుబాటులోనే ఉంటుందని భావిస్తారు. దగ్గరగా ఉంటే అలారం బాగా వినిపిస్తుందని అనుకునేవారూ ఉన్నారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
ఆ రేడియేషన్ ప్రమాదకరం
మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. ఈ రేడియేషన్ ప్రమాదకరమైంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులో కణితులు ఏర్పడే ప్రమాదముంది. అలాగే పలు క్యాన్సర్లు రావడానికి అవకాశముంది. దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు రేడియేషన్ నేరుగా తలకు చేరుకుంటుంది. దీని వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఈ సమస్యలూ వస్తాయి..
దిండు కింద పెట్టడం వల్ల ఫోన్లకు కూడా ఎంతోకొంత నష్టం జరుగుతుంది. సాధారణంగా గాలి ప్రసరించే ప్రదేశాల్లో ఫోన్ ఉంచాలి. దిండు కింద పెట్టిన్నప్పుడు గాలి ప్రసరణ లేక అది వేడెక్కుతుంది. ఇలా తరచూ ఓవర్ హీట్ అయితే మొబైల్ బ్యాటరీ దెబ్బతింటుంది. ఇక ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను దిండు కింద ఎట్టిపరిస్థితుల్లో పెట్టకూడదు. అలాంటి సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా అది పేలిపోయే ప్రమాదముంది.
నిద్రపోతున్నప్పుడు మీ ఫోన్‌ను దిండు కింద పెట్టే బదులు, దానిని మీ మంచానికి కొంచెం దూరంలో ఉన్న టేబుల్‌పై ఉంచడం మంచిది.
ఈ వార్తలూ చదవండి
మోకాళ్ల నొప్పికి ముఖ్య కారణం ఈ రోజువారీ అలవాట్లే.!
సాయంత్రం నడక Vs యోగా.. మంచి నిద్రకు ఏది మంచిది?