ఇంటి కాలుష్యం... ఇంతింత కాదయా!
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:11 AM
‘గృహమే కదా స్వర్గసీమ’ అనుకుంటారు. కానీ ఆ ఇల్లే ఓ కాలుష్యకారకం అని తెలిస్తే... అనారోగ్యానికి కారణం ఆ ఇంటి వాతావరణమే అయితే... ఊహించుకోవడానికే భయమేస్తోంది కదూ! కానీ అదే నిజం.
‘గృహమే కదా స్వర్గసీమ’ అనుకుంటారు. కానీ ఆ ఇల్లే ఓ కాలుష్యకారకం అని తెలిస్తే... అనారోగ్యానికి కారణం ఆ ఇంటి వాతావరణమే అయితే... ఊహించుకోవడానికే భయమేస్తోంది కదూ! కానీ అదే నిజం. బయటి కాలుష్యం కన్నా ఇంటి కాలుష్యం అనేక జబ్బులకు కారణమవుతోంది. బయటి కన్నా ఇంట్లో 12 రెట్లు ఎక్కువ కాలుష్యం ఉంటున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.
ఇంట్లో కొవ్వొత్తి వెలిగిస్తున్నారా? అది మీకు అనుకోకుండా వచ్చే జబ్బులకు కారణం కావొచ్చు. ఇంట్లో సువాసల కోసం రూమ్ ఫ్రెషనర్ వాడుతున్నారా? మీ జలుబు, దగ్గు, తలనొప్పికి అదే మూలం కావొచ్చు. ఇంట్లో ఫ్లోరింగ్‌ని రోజూ లిక్విడ్‌తో తుడుస్తున్నారా? మీ పిల్లలకు ఆస్తమాను తెచ్చిపెట్టేది ఆ లిక్విడే కావొచ్చు. సాధారణంగా కాలుష్యం అనగానే బయటే ఉంటుందని అనుకుంటాం. దాన్ని తప్పించుకుని ఇంటికి చేరితే ఇండోర్ పొల్యూషన్ కాటేసేందుకు సిద్ధంగా ఉంటోంది. చాలామంది తరచుగా అనారోగ్యానికి గురి కావడానికి ఇంట్లోని కాలుష్యమే కారణమని అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇంట్లో వాడే లిక్విడ్‌లు, కొవ్వొత్తులు, రూమ్ ఫ్రెషనర్ల లాంటివి అనేకం కాలుష్య రూపంలో జబ్బులకు కారణమవుతున్నాయి.
ఎందుకలా?
ఇంటి ఫ్లోరింగ్ రోజుకోసారైనా లిక్విడ్ వేసి శుభ్రం చేస్తారు. ఈమధ్యకాలంలో పాత్రలు శుభ్రం చేసేందుకు లీటర్ల కొద్దీ డిష్‌వాష్ లిక్విడ్ వాడేస్తున్నారు. వాష్‌రూమ్ కడగడానికి మరో లిక్విడ్, కమోడ్‌కు ఇంకోటి... వీటికి తోడు గదిలో సువాసనల కోసం రూమ్ ఫ్రెషనర్, రాత్రయితే దోమల నుంచి కాపాడుకోవడం రీపెల్లెంట్ ఆన్ చేయాల్సిందే. బాత్రూమ్‌లో నిమ్మ సువాసనలు వెదజల్లే ఎయిర్ ఫ్రెషనర్‌ను వేలాడదీస్తారు. ఈ దృశ్యాలన్నీ ఏ ఇంట్లో చూసినా కనిపించేవే. అయితే వాటివల్ల ఇల్లంతా రసాయనాలమయం అయిపోతోందని ఎప్పుడైనా ఆలోచించారా? వాటితోనే అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇంట్లో కాలుష్యానికి రోజూ ఉపయోగించే ఈ రకరకాల లిక్విడ్‌లే కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. రసాయనాలు ఇంటిని మెరిసేలా చేస్తాయి కావచ్చు కానీ, వాటిలో కనిపించని విషపదార్థాలు దాగి ఉంటాయి. తరచుగా పిల్లలు అనారోగ్యానికి గురికావడానికి, జలుబు, దగ్గు వంటివి విడవకుండా వేధించడానికి రసాయనాలే కారణం.
ఎయిర్ ఫ్రెషనర్స్
ఇంట్లో అడుగుపెట్టగానే ఆహ్లాదానిచ్చే సువాసనలు రావాలి. ఆ సువాసనలతో ఇల్లంతా ఫ్రెష్‌గా ఉన్న అనుభూతి కలగాలి. ఇందుకోసం ఎడాపెడా ఎయిర్‌ఫ్రెషనర్లను ఆశ్రయిస్తుంటారు చాలామంది. నిజానికి ఎయిర్‌ఫ్రెషనర్లతో వచ్చే పరిమళాల్ని పక్కన పెడితే, వాటివల్ల విడుదలయ్యే ప్రమాదకరమైన గ్యాస్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటి ప్రభావం పాసివ్ స్మోకింగ్‌తో సమానం. రూమ్ ఫ్రెషనర్లలో ఇథైలెన్ బేస్డ్ గ్లైకాల్ ఎక్కువ మొత్తంలో ఉంటున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఇది నరాల సమస్యలు, నీరసం, వాంతులు, ఎనీమియా వంటి వాటికి కారణమవుతుంది. చిన్నపిల్లలు సహా మహిళలు, వృద్ధులపై వీటి ప్రభావం ఎక్కువ. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా, పునరుత్పత్తి వ్యవస్థపై దుష్ప్రభావాలను కలగజేస్తాయి.
‘క్లీనింగ్’ ఉత్పత్తులు
ఇంటి ఫ్లోరింగ్‌ను శుభ్రం చేసేందుకు ఒక లిక్విడ్. కిచెన్ టాప్‌ను శుభ్రం చేసేందుకు మరో లిక్విడ్. వాష్‌రూమ్‌ను కడిగేందుకు ఇంకో లిక్విడ్. ఇలా రకరకాల లిక్విడ్‌లతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నామని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఇంట్లోకి రకరకాల ప్రమాదకరమైన రసాయనాలను కొని తెచ్చుకుంటున్నాం. క్లీనింగ్ ప్రొడక్ట్స్‌లో ఆల్కహాల్, అమ్మోనియా, క్లోరిన్, పెట్రోలియం ఆధారిత ద్రావకాలు, రసాయనాలు ఉంటాయి. వీటిని పీల్చినా, తాకినా ప్రమాదమే. కళ్ల మంటలు, గొంతునొప్పి, తలనొప్పికి కారణమవుతాయి. ఇంటి క్లీనింగ్ ఉత్పత్తులు ప్రమాదకరమైన అస్థిర సేంద్రియ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి వీటిని అతిగా వాడటం శ్రేయస్కరం కాదు.
ఆరోగ్యంపై రంగు పడుద్ది...
అప్పుడే రంగులు వేసిన ఇంట్లోకి అడుగుపెట్టి చూడండి. ఘాటైన వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు, ముక్కు ఇరిటేషన్‌కు గురవుతాయి. దానికి కారణం గాలిలో శక్తిమంతమైన న్యూరోటాక్సిన్ ఉండటమే. ఈ న్యూరోటాక్సిన్ విడుదలకు కారణం రంగుల్లో అస్థిర సేంద్రియ సమ్మేళనాలను (వీఓసీ) ఉపయోగించడం. ఇవి రంగులు వేసిన తరువాత కొన్ని వారాల పాటు ఆఫ్ గ్యాస్‌ను సృష్టిస్తాయి. దీనివల్ల తలనొప్పి, తలతిరగడం, వికారం, అలసట, స్కిన్ అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
కొవ్వొత్తులు వెలిగిస్తే...
అతిథులొస్తున్నారంటే ఇల్లు ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దుతారు. పరిమళాలు వెదజల్లేందుకు క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇంట్లో పార్టీ ఉంటే కనుక పదుల సంఖ్యలో కొవ్వొత్తులతో ఇంటిని అలంకరిస్తారు. నిజమే! ఒక్క క్యాండిల్ ఇంటి లుక్‌నే మార్చేస్తుంది. ఇది ఎవ్వరూ కాదనరు. కానీ అవే క్యాండిల్స్ ఆరోగ్యానికి హానిచేసే గ్యాస్‌లతో గదిని కాలుష్యం చేస్తాయి. క్యాండిల్స్‌ను మండించడం వల్ల అతి సూక్ష్మమైన కార్బన్ కణాలు గాలిలోకి విడుదలవుతాయి. వాటిని పీల్చినప్పుడు శ్వాస సంబంధ సమస్యలు మొదలవుతాయి. ఇదిలా ఉంటే సాధారణ కొవ్వొత్తులతో పోలిస్తే సెంటెడ్ క్యాండిల్స్ ఇంకా ప్రమాదకరం. లావెండర్, జాస్మిన్, శాండల్‌వుడ్ వంటి సువాసనలు విశ్రాంతితో పాటు ఉత్తేజానిస్తాయి.
అయితే ఎక్కువ సుగంధాలను వెదజల్లే క్యాండిల్స్ ఇంట్లోని గాలి నాణ్యతపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. వాక్స్ నుంచి విక్ వరకు సెంటెడ్ క్యాండిల్ ఏదైనా గాలిలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. కాబట్టి సెంటెడ్ క్యాండిల్స్‌ను వెలిగించే ముందు ఒక్కసారి ఆలోచించాలి. వీటితో పాటు పారాఫిన్ వాక్స్ క్యాండిల్స్ సురక్షితమేనా? అంటే కాదనే చెప్పాలి. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రాఫికల్ డిసీజ్ అండ్ హెల్త్’ 2017లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం పారాఫిన్ క్యాండిల్స్ వెలువరించే హానికారక పదార్థాలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చాలావరకు క్యాండిల్స్ పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన పారాఫిన్‌తో తయారవుతాయి. ఈ క్యాండిల్స్‌ను మండించడం వల్ల అల్కేన్స్, ఎసిటోన్, బెంజిన్, టాలిన్ అనే కార్సినోజన్లు విడుదలవుతాయి. వీటిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి శోషించబడతాయి. ఫలితంగా అలర్జీలు, ఆస్తమా, గుండెజబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వంటివి వస్తాయి.
ఎయిర్ ప్యూరిఫయర్స్ మంచివేనా?
ఇంట్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘ఎయిర్ ప్యూరిఫయర్స్’ ఉన్నాయి. అలర్జెన్‌లు, డస్ట్, ఇతర కాలుష్య కారకాలను తొలగించి ఇంట్లో గాలి నాణ్యతను పెంచుతాయు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. డస్ట్, పోలెన్, పెట్స్ వల్ల వచ్చే డాండర్, స్మోక్, డస్ట్‌మైట్స్, బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలు, ఇతర దుర్వాసనలను ఎయిర్ ప్యూరిఫయర్ సమర్థవంతంగా తొలగిస్తుంది.
మేలు చేసే మొక్కలు
ఇంట్లో పెంచుకునే మొక్కలు మనసుకు హాయినివ్వడంతోపాటు గాలిలో ఉన్న హానికారకాలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఈమధ్యకాలంలో ఇంట్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ‘నాసా’ క్లీన్ ఎయిర్ స్టడీ పేరుతో నిర్వహించిన ఒక సర్వేలో... ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎంతవరకు గాలిని శుభ్రం చేస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో కొన్ని మొక్కలు కొన్ని కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగిస్తున్నట్టు తేలింది. ఇటీవల పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైతం ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా గదుల్లో సింగోనియం, మనీ ప్లాంట్, అరేకియా పామ్ వంటి మొక్కలను పరిశీలించారు. ఈ మొక్కలు గదుల్లో తేమ శాతాన్ని పెంచాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను సురక్షితమైన స్థాయిలో ఉండేలా చూశాయి. కావున సాధ్యమైనంత వరకు ఇంట్లో రసాయనాలను తగ్గించి, ఆక్సిజన్‌ను అందించే మొక్కలను పెంచితే ఇంటి కాలుష్యం నుంచి బయటపడొచ్చు.
ఇంట్లో కొవ్వొత్తి వెలిగిస్తున్నారా? అది మీకు అనుకోకుండా వచ్చే జబ్బులకు కారణం కావొచ్చు. ఇంట్లో సువాసల కోసం రూమ్ ఫ్రెషనర్ వాడుతున్నారా? మీ జలుబు, దగ్గు, తలనొప్పికి అదే మూలం కావొచ్చు. ఇంట్లో ఫ్లోరింగ్‌ని రోజూ లిక్విడ్‌తో తుడుస్తున్నారా? మీ పిల్లలకు ఆస్తమాను తెచ్చిపెట్టేది ఆ లిక్విడే కావొచ్చు. సాధారణంగా కాలుష్యం అనగానే బయటే ఉంటుందని అనుకుంటాం. దాన్ని తప్పించుకుని ఇంటికి చేరితే ఇండోర్ పొల్యూషన్ కాటేసేందుకు సిద్ధంగా ఉంటోంది. చాలామంది తరచుగా అనారోగ్యానికి గురి కావడానికి ఇంట్లోని కాలుష్యమే కారణమని అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇంట్లో వాడే లిక్విడ్‌లు, కొవ్వొత్తులు, రూమ్ ఫ్రెషనర్ల లాంటివి అనేకం కాలుష్య రూపంలో జబ్బులకు కారణమవుతున్నాయి.
ఎందుకలా?
ఇంటి ఫ్లోరింగ్ రోజుకోసారైనా లిక్విడ్ వేసి శుభ్రం చేస్తారు. ఈమధ్యకాలంలో పాత్రలు శుభ్రం చేసేందుకు లీటర్ల కొద్దీ డిష్‌వాష్ లిక్విడ్ వాడేస్తున్నారు. వాష్‌రూమ్ కడగడానికి మరో లిక్విడ్, కమోడ్‌కు ఇంకోటి... వీటికి తోడు గదిలో సువాసనల కోసం రూమ్ ఫ్రెషనర్, రాత్రయితే దోమల నుంచి కాపాడుకోవడం రీపెల్లెంట్ ఆన్ చేయాల్సిందే. బాత్రూమ్‌లో నిమ్మ సువాసనలు వెదజల్లే ఎయిర్ ఫ్రెషనర్‌ను వేలాడదీస్తారు. ఈ దృశ్యాలన్నీ ఏ ఇంట్లో చూసినా కనిపించేవే. అయితే వాటివల్ల ఇల్లంతా రసాయనాలమయం అయిపోతోందని ఎప్పుడైనా ఆలోచించారా? వాటితోనే అనారోగ్యాన్ని ‘కొని’ తెచ్చుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. ఇంట్లో కాలుష్యానికి రోజూ ఉపయోగించే ఈ రకరకాల లిక్విడ్‌లే కారణమవుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. రసాయనాలు ఇంటిని మెరిసేలా చేస్తాయి కావచ్చు కానీ, వాటిలో కనిపించని విషపదార్థాలు దాగి ఉంటాయి. తరచుగా పిల్లలు అనారోగ్యానికి గురికావడానికి, జలుబు, దగ్గు వంటివి విడవకుండా వేధించడానికి రసాయనాలే కారణం.
ఎయుర్ ఫ్రెషనర్స్
ఇంట్లో అడుగుపెట్టగానే ఆహ్లాదానిచ్చే సువాసనలు రావాలి. ఆ సువాసనలతో ఇల్లంతా ఫ్రెష్‌గా ఉన్న అనుభూతి కలగాలి. ఇందుకోసం ఎడాపెడా ఎయిర్‌ఫ్రెషనర్లను ఆశ్రయిస్తుంటారు చాలామంది. నిజానికి ఎయిర్‌ఫ్రెషనర్లతో వచ్చే పరిమళాల్ని పక్కన పెడితే, వాటివల్ల విడుదలయ్యే ప్రమాదకరమైన గ్యాస్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వీటి ప్రభావం పాసివ్ స్మోకింగ్‌తో సమానం. రూమ్ ఫ్రెషనర్లలో ఇథైలెన్ బేస్డ్ గ్లైకాల్ ఎక్కువ మొత్తంలో ఉంటున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఇది నరాల సమస్యలు, నీరసం, వాంతులు, ఎనీమియా వంటి వాటికి కారణమవుతుంది. చిన్నపిల్లలు సహా మహిళలు, వృద్ధులపై వీటి ప్రభావం ఎక్కువ. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా, పునరుత్పత్తి వ్యవస్థపై దుష్ప్రభావాలను కలగజేస్తాయి.
‘క్లీనింగ్’ ఉత్పత్తులు
ఇంటి ఫ్లోరింగ్‌ను శుభ్రం చేసేందుకు ఒక లిక్విడ్. కిచెన్ టాప్‌ను శుభ్రం చేసేందుకు మరో లిక్విడ్. వాష్‌రూమ్‌ను కడిగేందుకు ఇంకో లిక్విడ్. ఇలా రకరకాల లిక్విడ్‌లతో ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటున్నామని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఇంట్లోకి రకరకాల ప్రమాదకరమైన రసాయనాలను కొని తెచ్చుకుంటున్నాం. క్లీనింగ్ ప్రొడక్ట్స్‌లో ఆల్కహాల్, అమ్మోనియా, క్లోరిన్, పెట్రోలియం ఆధారిత ద్రావకాలు, రసాయనాలు ఉంటాయి. వీటిని పీల్చినా, తాకినా ప్రమాదమే. కళ్ల మంటలు, గొంతునొప్పి, తలనొప్పికి కారణమవుతాయి. ఇంటి క్లీనింగ్ ఉత్పత్తులు ప్రమాదకరమైన అస్థిర సేంద్రియ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి వీటిని అతిగా వాడటం శ్రేయస్కరం కాదు.
ఆరోగ్యంపై రంగు పడుద్ది...
అప్పుడే రంగులు వేసిన ఇంట్లోకి అడుగుపెట్టి చూడండి. ఘాటైన వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు, ముక్కు ఇరిటేషన్‌కు గురవుతాయి. దానికి కారణం గాలిలో శక్తిమంతమైన న్యూరోటాక్సిన్ ఉండటమే. ఈ న్యూరోటాక్సిన్ విడుదలకు కారణం రంగుల్లో అస్థిర సేంద్రియ సమ్మేళనాలను (వీఓసీ) ఉపయోగించడం. ఇవి రంగులు వేసిన తరువాత కొన్ని వారాల పాటు ఆఫ్ గ్యాస్‌ను సృష్టిస్తాయి. దీనివల్ల తలనొప్పి, తలతిరగడం, వికారం, అలసట, స్కిన్ అలర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
కొవ్వొత్తులు వెలిగిస్తే...
అతిథులొస్తున్నారంటే ఇల్లు ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దుతారు. పరిమళాలు వెదజల్లేందుకు క్యాండిల్స్ వెలిగిస్తారు. ఇంట్లో పార్టీ ఉంటే కనుక పదుల సంఖ్యలో కొవ్వొత్తులతో ఇంటిని అలంకరిస్తారు. నిజమే! ఒక్క క్యాండిల్ ఇంటి లుక్‌నే మార్చేస్తుంది. ఇది ఎవ్వరూ కాదనరు. కానీ అవే క్యాండిల్స్ ఆరోగ్యానికి హానిచేసే గ్యాస్‌లతో గదిని కాలుష్యం చేస్తాయి. క్యాండిల్స్‌ను మండించడం వల్ల అతి సూక్ష్మమైన కార్బన్ కణాలు గాలిలోకి విడుదలవుతాయి. వాటిని పీల్చినప్పుడు శ్వాస సంబంధ సమస్యలు మొదలవుతాయి. ఇదిలా ఉంటే సాధారణ కొవ్వొత్తులతో పోలిస్తే సెంటెడ్ క్యాండిల్స్ ఇంకా ప్రమాదకరం. లావెండర్, జాస్మిన్, శాండల్‌వుడ్ వంటి సువాసనలు విశ్రాంతితో పాటు ఉత్తేజానిస్తాయి. అయితే ఎక్కువ సుగంధాలను వెదజల్లే క్యాండిల్స్ ఇంట్లోని గాలి నాణ్యతపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి.
వాక్స్ నుంచి విక్ వరకు సెంటెడ్ క్యాండిల్ ఏదైనా గాలిలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. కాబట్టి సెంటెడ్ క్యాండిల్స్‌ను వెలిగించే ముందు ఒక్కసారి ఆలోచించాలి. వీటితో పాటు పారాఫిన్ వాక్స్ క్యాండిల్స్ సురక్షితమేనా? అంటే కాదనే చెప్పాలి. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ట్రాఫికల్ డిసీజ్ అండ్ హెల్త్’ 2017లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం పారాఫిన్ క్యాండిల్స్ వెలువరించే హానికారక పదార్థాలు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. చాలావరకు క్యాండిల్స్ పెట్రోలియం ఉప ఉత్పత్తి అయిన పారాఫిన్‌తో తయారవుతాయి. ఈ క్యాండిల్స్‌ను మండించడం వల్ల అల్కేన్స్, ఎసిటోన్, బెంజిన్, టాలిన్ అనే కార్సినోజన్లు విడుదలవుతాయి. వీటిని పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి శోషించబడతాయి. ఫలితంగా అలర్జీలు, ఆస్తమా, గుండెజబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వంటివి వస్తాయి.
ఎయిర్ ప్యూరిఫయర్స్ మంచివేనా?
ఇంట్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ‘ఎయిర్ ప్యూరిఫయర్స్’ ఉన్నాయి. అలర్జెన్‌లు, డస్ట్, ఇతర కాలుష్య కారకాలను తొలగించి ఇంట్లో గాలి నాణ్యతను పెంచుతాయు. అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్లను ఉపయోగిస్తున్నారు. డస్ట్, పోలెన్, పెట్స్ వల్ల వచ్చే డాండర్, స్మోక్, డస్ట్‌మైట్స్, బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలు, ఇతర దుర్వాసనలను ఎయిర్ ప్యూరిఫయర్ సమర్థవంతంగా తొలగిస్తుంది.
మేలు చేసే మొక్కలు
ఇంట్లో పెంచుకునే మొక్కలు మనసుకు హాయినివ్వడంతోపాటు గాలిలో ఉన్న హానికారకాలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఈమధ్యకాలంలో ఇంట్లో మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ‘నాసా’ క్లీన్ ఎయిర్ స్టడీ పేరుతో నిర్వహించిన ఒక సర్వేలో... ఇంట్లో పెంచుకునే మొక్కలు ఎంతవరకు గాలిని శుభ్రం చేస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో కొన్ని మొక్కలు కొన్ని కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగిస్తున్నట్టు తేలింది. ఇటీవల పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైతం ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా గదుల్లో సింగోనియం, మనీ ప్లాంట్, అరేకియా పామ్ వంటి మొక్కలను పరిశీలించారు. ఈ మొక్కలు గదుల్లో తేమ శాతాన్ని పెంచాయి. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను సురక్షితమైన స్థాయిలో ఉండేలా చూశాయి. కావున సాధ్యమైనంత వరకు ఇంట్లో రసాయనాలను తగ్గించి, ఆక్సిజన్‌ను అందించే మొక్కలను పెంచితే ఇంటి కాలుష్యం నుంచి బయటపడొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండిపై వార్ ఎఫెక్ట్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ
Read Latest Telangana News and National News