‘ఈ ప్రభుత్వం మీది.. అండగా ఉంటాం’
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:01 AM
‘ఈ ప్రభుత్వం మీది.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
మదీనా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘ఈ ప్రభుత్వం మీది.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. గతేడాది మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు శనివారం సచివాలయంలో సీఎం పరిహారం అందజేశారు. 44 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించారు. సాధారణంగా దేశం వెలుపల జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని, కానీ మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాల స్థితిగతులను చూసి సాయం చేశామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.