41 మంది ఐఏఎస్‌లకు కేంద్రంలో సెక్రటరీ హోదా
ABN , Publish Date - Mar 01 , 2026 | 02:39 AM
దేశంలోని పలు రాష్ట్రాల కేడర్‌లలో పనిచేస్తున్న ఐఏయ్‌సలకు వారి హోదాను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఆమోదించిన క్యాబినెట్ నియామకాల కమిటీ
తెలంగాణ కేడర్‌లో సంజయ్‌కుమార్‌కు కూడా..
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పలు రాష్ట్రాల కేడర్‌లలో పనిచేస్తున్న ఐఏయ్‌సలకు వారి హోదాను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 41 మంది ఐఏఎస్‌లకు (1990-1995 బ్యాచ్) సెక్రటరీ హోదా కల్పిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆ వివరాలను సంబంధిత అఽధికారులకు తెలుపుతూ సమాచార పత్రాన్ని శనివారం పంపింది. ఇందులో భాగంగా తెలంగాణ కేడర్‌లో ఉన్న ఐఏయస్ సంజయ్‌కుమార్‌కు కూడా కేంద్రంలో సెక్రటరీ స్థాయి హోదా దక్కింది. ప్రస్తుతం సంజయ్‌కుమార్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.