Sweating excessively: ఎక్కువగా చెమట పడితే ప్రమాదమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:42 PM
కొంతమందికి ఎలాంటి కష్టం చేయకున్నా, వేడి లేకున్నా ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే.. కానీ మరీ ఎక్కువగా చెమటలు పట్టినా అది అనుమానించాల్సిన విషయమేనని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చెమట(Sweat) పట్టడం అనేది శరీర ఉష్ణోగ్రత(body temperature)ను క్రమబద్ధీకరించడానికి జరిగే సహజ ప్రక్రియ. ఎలాంటి అనారోగ్యం, శారీరక శ్రమ, వేడి లేకుండా చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని చెమటను తొలగించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ‘హైపర్ హైడ్రోసిస్’ (Hyperhidrosis) అని పిలుస్తారు. చెమటతో పాటు కొన్ని లక్షణాలు కనిపిస్తే.. అది తీవ్రమైతే ఆరోగ్య సమస్యకు సంకేతమని చెబుతున్నారు నిపుణులు.
గుండె సమస్యలు: అకస్మాత్తుగా చెమటలు పడుతూ.. ఛాతిలో నొప్పి రావడం, ఎడమ చేయి లాగడం లేదా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అది హార్ట్ ఎటాక్ లక్షణం కావొచ్చు. సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చు.
థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ గ్రంథి (Hyperthyroidism) అతిగా పనిచేయడం వల్ల శరీరం వేడెక్కి ఎక్కువగా చెమటలు పడతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి అధికంగా చెమటలు పడితే అది ప్రమాదానికి సంకేతం.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవడం మంచిది.
డయాబెటీస్: రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పడిపోయినప్పుడు (Hypoglycemia) శరీరం చల్లగా మారి చెమటలు పడతాయి. దీనికి తోడు బీపీ ఉంటే.. ప్రాణాలకు ప్రమాదమని గుర్తించాలి. సరైన మెడిసిన్స్ తీసుకుంటే మంచిది.
రాత్రిపూట చెమటలు: ఫ్యాన్ గాలి వస్తున్నా నిద్రలో విపరీతంగా చెమటలు పట్టి బట్టలు తడిసిపోతుంటే అది ఇన్‌ఫెక్షన్లు లేదా కొన్ని రకాల క్యాన్సర్లకు సంకేతం కావొచ్చు. వైద్యుడిని సంప్రదించి సరైన మెడిసిన్స్ తీసుకోవడం మంచిది.
హార్మోన్ల మార్పులు: మహిళల్లో మెనోపాజ్ సమయంలో ‘హాట్ ఫ్లాషెస్’ వల్ల చెమటలు ఎక్కువగా పడుతుంటాయి.
అధిక చెమట ఎందుకు పడుతుంది:
ప్రైమరీ హైపర్ హైడ్రోసిన్: ఇది ఎటువంటి అనారోగ్యం లేకుండానే వస్తుంది. సాధారణంగా అరచేతులు, అరికాళ్లు, ముఖంపై ఎక్కువగా చమట పడుతుంది. ఇది వంశపార్యంపర్యంగానూ రావచ్చు.
సెకండరీ హైపర్ హైడ్రోసిన్: ఏదైనా ఇతర ఆరోగ్య సమస్య వల్ల లేదా మందులు వాడకం వల్ల వచ్చే చెమట. ఇది సాధారణంగా శరీరమంతా పడుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అధికంగా చెమటలు పడుతున్న వారు నీరు ఎక్కువగా తాగాలి. చెమట ద్వారా శరీరం నీటిని కోల్పోతుంది కాబట్టి డీహైడ్రేషన్ అవుతుంది. అందుకోసం సాధ్యమైనంత వరకు నీటిని తీసుకుంటే కొంత వరకు కంట్రోల్ ఉండొచ్చు.
చెమట వల్ల చర్మ వ్యాధులు రాకుండా రోజూ రెండుసార్లు స్నానం చేయడం, కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
ఎలాంటి కారణం లేకుండా అధికంగా చెమటలు పడితే బ్లడ్ షుగర్, థైరాయిడ్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి. ఇందులో ఏది కన్ఫామ్ అయినా మెడిసిన్స్ తీసుకొని కంట్రోల్ చేయొచ్చు.
కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువగా పడుతుంది.
నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తరుచూ తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని కంట్రోల్ చేయెుచ్చు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News