ఆహారం.. ఆరోగ్యం
ABN , Publish Date - Mar 04 , 2026 | 08:52 AM
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలరోజులపాటు దీక్షలో ఉంటారు. తెల్లవారుజామున సహర్‌కు ముందు ఆహారం తీసుకుంటే మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోరు.
మార్కెట్‌లో జోరుగా డ్రైఫ్రూట్స్ విక్రయాలు
మండపేట, మార్పి3 (ఆంధ్రజ్యోతి): పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు (Ramadan Fasting) కొనసాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలరోజులపాటు దీక్షలో ఉంటారు. తెల్లవారుజామున సహర్‌కు ముందు ఆహారం తీసుకుంటే మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోరు. మారిన పరిస్థితుల నేపథ్యంలో గంటల తరబడి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండటం అంటే ఇబ్బందే. ఉపవాస దీక్షలో ఉన్న వారు పగటి వేళంతా అంతే ఉత్సాహంతో కనిపించాలంటే ఉదయం, రాత్రి తీసుకునే ఆహారంతోపాటు, ఎండుఫలాలు, పండ్లు (Dry fruits) తీసుకోవటం మంచిదని పోషకాహార నిఫుణులు చెబుతున్నారు. ఇవి రోజంతా మనిషికి అలసట, నీరసం లేకుండా శక్తినిస్తాయని చెబుతున్నారు.
రంజాన్ మానంలో కేవలం ముస్లిం సోదరులే కాకుండా అందరూ కూడా కొనుగోలు చేసే విధంగా డ్రైఫ్రూట్స్‌ను వివిధ రకాల ప్యాకెట్లలో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అలాగే ముస్లిం సోదరులకు బహుమతిగా ఇవ్వడానికి వీలుగా ఉండేలా ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లు సిద్ధం చేశారు. ప్యాకింగ్‌లో కిలో ఒక్కోరకం 200 గ్రాముల వంతున జీడిపప్పు, బాధం, పిస్తా, కిస్‌మిస్, ఖర్జూరంతో తయారు చేస్తున్నారు. అలాగే ముస్లింలు అధికంగా ఇష్టపడే సేమియాలు పట్టణాల్లోని పలు దుకాణాల్లో విక్రయిస్తున్నారు.
జోరుగా డ్రైఫ్రూట్స్ వ్యాపారం..
మార్కెట్‌లో ఏటా డ్రైఫ్రూట్స్ వ్యాపారం జరిగినా రంజాన్‌వేళ ఈ వ్యాపారం జోరుగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో డ్రైఫ్రూట్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రోజూ ఉపవాసం వేళ శక్తినిచ్చే గుణం వీటిలో అధికంగా ఉండటంతో వీటి అమ్మకాలు అధికంగా ఉంటాయని డ్రైఫ్రూట్స్ వ్యాపారి నాగేశ్వరరావు చెప్పారు. సాధారణ రోజుల్లో కంటే రంజాన్‌వేళ 35శాతం అమ్మకాలు పెరిగాయని డ్రైఫ్రూట్స్ వ్యాపారులు చెబుతున్నారు. అలాగే దేశంలో ప్రధాన పట్టణాలైన ఢిల్లీ, ముంబాయితోపాటు దుబాయ్, షార్జా, కువైట్ వంటి అరబ్ దేశాల నుంచి కూడా డ్రైఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటారు. ఎండుఫలాల విషయానికి వస్తే సహర్ ఉదయం వేళ ఆహారంతోపాటు బాధం, జీడిపప్పు, పిస్తా, అంజిర్, అక్రోట్, కిస్‌మిస్ తీసుకోవటం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరం, ఎండుఫలాల్లో అంత్యంత శక్తినిచ్చేది ఖర్జూరం. ఇందులో ఉండే గ్లూకోజ్ ప్రక్టోజ్ శరీరాన్ని ఉల్లాసపరుస్తాయి. నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గింజలు తీసేసి తీసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు అయినా తీసుకుంటే గుండె ఎంతో పదిలంగా ఉంటుంది.. అలసట దరిచేరనివ్వదు. ఇందులో కొద్దిపాళ్లలో ఉన్న నికోటిన్ పేగుల్లోని ఇబ్బందులను తొలగిస్తోంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా తింటే తగినంత పోటాషియం లభిస్తోంది. బీపీని కూడా నియంత్రిస్తుంది. 100 గ్రాముల ఖర్జూరంలో 7.3శాతం ఐరన్ ఉంటుంది. 94 క్యాలరీల శక్తి, 1.8 గ్రాముల పొటాషియం, 55గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.5 గ్రాముల కొవ్వు. 7 గ్రాముల పీచు పదార్ధాం. 60 గ్రాముల పొటాషియంతోపాటు విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఎండు ఖర్జూరమైతే 317 క్యాలరీల శక్తి ఉంటుంది.
పిస్తా పప్పులో 567 క్యాలరీల శక్తి, 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. 20 గ్రాముల ప్రోటీన్లు ఉన్నాయి.
జీడిపప్పులో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. గుండెకు శక్తిని ఇవ్వటమే కాకుండా కంటిచూపును కూడా మెరుగుపరుస్తోంది. ఇందులో పొటాషియం, పాస్పరస్ విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. రోజుకు పదికన్నా ఎక్కువగా తినకూడదు. 100 గ్రాముల జీడిపప్పులో 250 క్యాలరీల శక్తి, 4.0శాతం ప్రొటీన్లు, 1.9శాతం ఐరన్ ఉంటాయి.
ప్రోటిన్స్ అందించే వాల్‌నట్స్‌ను తింటే అధికంగా లభించే అరుదైన ఒమెగా 3ప్యాటీ అసిడ్స్ లభిస్తాయి.
విటమిన్ ఇ పైబర్ కూడా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో వీటిలో ఉన్నాయి. రోజుకు రెండు మూడు వాల్‌నట్స్ తినవచ్చు.
కిస్‌మిస్ తినేముందు మధురంగా రుచిగా ఉండే కిస్‌మిస్‌లో ఎనలేని ప్రయోజనాలు ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. శక్తినిస్తాయి. రాత్రివేళల్లో ఒక గ్లాస్‌లో నానబెట్టి ఉదయాన్నే తాగితే కడుపు శుభ్రం అవుతుంది. 100 గ్రాముల కిస్‌మిస్‌లో 209 క్యాలరీల శక్తి ఉంటుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ తగిన స్థాయిలో ఉంటాయి.
బాదంలో అధికంగా పోషకాలు ఉంటాయి. బాదం పొడిని పాలల్లో కలిపి తాగితే మంచిది. ఐరన్ కాపర్, పాస్పరస్, విటమిన్ బి1లు, శక్తి ప్రేరేపిస్తాయి. శరీరంలో రక్తకణాలు, హిమోగ్లోబిన్ శాతం పెరిగేలా చేస్తాయి. కండరాలకు బలంనిస్తో్ంది. బాదంలో 250 క్యాలరీల శక్తి, 5 శాతం ప్రోటీన్లు, 2శాతం మేర ఐరన్ ఉంటుంది.
అంజీరా రంజాన్ మాసంలో విరివిగా లభించే అంజురా పండు రక్తశుద్దికి రక్తహీనతను తగ్గించి రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. 100 గ్రాముల అంజీరాలో 200 క్యాలరీల శక్తి 27 గ్రాముల కార్బోహైడ్రెడ్స్, 389 గ్రాములు ప్రోటీన్స్ ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రసాంధించిన ఎండుపండ్లలో మానవాళికి మేలుచేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇలాంటి పండ్లను తినటం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News