కేరళం పీసీసీ కార్యాలయంలో మిన్నంటిన సంబరాలు.. వీడియోలు వైరల్
ABN , Publish Date - May 04 , 2026 | 01:11 PM
దాదాపు దశాబ్దం తర్వాత కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.
తిరువనంతపురం, మే 04: కేరళం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమెక్రటిక్ ఫ్రెంట్ (యూడీఎఫ్) కూటమి తన సత్తా చాటుతోంది. మొత్తం140 అసెంబ్లీ స్థానాలకు గాను 100కు పైగా నియోజకవర్గాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో కేరళం రాజధాని తిరువనంతపురంలోని కేపీసీసీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ కేక్ కట్ చేశారు.
సహచర నేతలకు ఆయన మిఠాయిలు పంచి పెట్టారు. కార్యాలయం వెలుపల కార్యకర్తలు, నేతలు బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా కేరళం ప్రదేశ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి పార్టీ శ్రేణులు పోటెత్తాయి. అందుకు సంబంధించిన వీడియోలను పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అలాగే దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దాదాపు దశాబ్దం తర్వాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుండడంతో.. ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ కేవలం 40 స్థానాల్లోనే అధిక్యతను ప్రదర్శిస్తుంది.
ఫలితాలపై స్పందించిన ఎంపీ శశిథరూర్
రాష్ట్రంలో ఓటర్లు మార్పు కోరుకుంటున్నట్లు ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తెలిపారు. పాలన పట్ల మరింత నిర్మాణాత్మకమైన, దూరదృష్టితో కూడిన విధానం వైపు ఓటర్లు మారుతున్నట్లు ఈ తీర్పు సూచిస్తుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏఐఏడీఎంకేతో విజయ్ చేతులు కలుపుతారా?
ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ
For More National News And Telugu News