Share News

ఇప్పటి వరకూ రూ.151 కోట్ల నగదు, నగల స్వాధీనం

ABN , Publish Date - Mar 24 , 2026 | 01:20 PM

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటినుండి సోమవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారుల తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్‌ ప్రకటించారు.

ఇప్పటి వరకూ రూ.151 కోట్ల నగదు, నగల స్వాధీనం

  • ఈసీ అర్చనా పట్నాయక్‌

చెన్నై: ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటినుండి సోమవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘ అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారుల తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్‌ ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్ళాలంటే రశీదులు, ఆధార పత్రాలుండాలని ఆమె తెలిపారు.


nani1.2.jpgఎన్నికలకు సంబంధించి సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటివరకూ 794 ఫిర్యాదులు వచ్చాయని, 20 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని, తక్కినవాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించామని తెలిపారు. కొత్తగా ఓటరు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారిలో 50 శాతం మంది ఓటరు గుర్తింపు కార్డులు పోస్టు ద్వారా పంపినట్లు ఆమె చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ఆ కేంద్రాల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు.


మాధవరంలో రూ.50లక్షల స్వాధీనం...

మాధవరం జీఎస్టీ రోడ్డులోని కళాశాల సమీపంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారుల తనిఖీలో రూ.50లక్షల నగదు పట్టుబడింది. ఓ ఫైనాన్స్‌ సంస్థకు చెందిన వాహనాన్ని అధికారులు సోదాచేయగా, ఎలాంటి రశీదులు లేకుండా రూ.50.66 లక్షల నగదును గుర్తించి వెంటనే స్వధీనం చేసుకున్నారు. ఆ ఫైనాన్స్‌ సంస్థ సిబ్బంది పలు చోట్ల నుండి వసూలు చేసి ఆ నగదును తీసుకెళుతున్నారని తెలిసింది. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం నగదుకు సంబంధించి రశీదులు లేకపోవడంతో ఆ నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే రీతిలో ఎడప్పాడి వద్ద బైకు మీద తీసుకువెళ్తున్న రూ.3.67 లక్షల నగదును కూడా ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఢిల్లీలో హై అలర్ట్‌.. ప్రధాని, కేంద్ర మంత్రులకు బాంబు బెదిరింపులు

ఇది కరోనా తరహా సంక్షోభం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 24 , 2026 | 01:20 PM