ఐపీఎల్ 2026: పేసర్లు కూల్‌గా ఉంటానంటే నేను ఒప్పుకోను: శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:50 PM
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్లకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్లకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాడు. మంగళవారం అహ్మదాబాద్‌లో ‘శుభారంభం 2026’ పేరుతో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ నిర్వహించిన కార్యక్రమంలో గిల్ మాట్లాడాడు. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా పక్కనే ఉన్న సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
‘మన జట్టులో ఫాస్ట్ బౌలర్లు కూల్‌గా ఉంటా అంటే నేను ఒప్పుకోను. అలాంటి బౌలర్లు నాకు అవసరం లేదు కూడా. మన కోచ్ నెహ్రాలాగా ఫైర్‌తో ఉండాలి. ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేస్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవారో అందరికీ తెలుసు. గతంలో ఎంఎస్ ధోనీ కూడా నెహ్రా కోపానికి గురయ్యాడు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి’ అంటూ సరదాగా గిల్ వ్యాఖ్యానించాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేయర్ల గురించి గిల్ మాట్లాడాడు. ‘కగిసో రబాడా, సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, హోల్డర్ వంటి బౌలర్లు మా టీమ్‌లోఉన్నారు. వాళ్లే మా జట్టుకు ప్రధాన బలం. గత సీజన్‌లో ప్రసిద్ధ్ 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచాడు. అయినప్పటికీ గుజరాత్‌కు టైటిల్ రాలేదు. మేం మంచి క్రికెటే ఆడాం. ట్రోఫీ గెలవకపోయినా మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాం. ఈసారి మా తప్పులను సరిచేసి మరింత బలంగా తిరిగొస్తాం’ అని గిల్ వెల్లడించాడు. మరోవైపు కోచ్ నెహ్రా తనదైన శైలిలో స్పందిస్తూ ‘ఆడేది వాళ్లే.. నేను బయట కూర్చుంటాను’ అంటూ సరదాగా చెప్పడంతో హాల్‌లో నవ్వులు వెల్లువెత్తాయి. ఇక ఈ సీజన్‌లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో మార్చి 31న న్యూ చండీగఢ్‌లో ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ఒక కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాళ్లు ముందున్నాయి: సౌరభ్ గంగూలీ
ఐపీఎల్ 2026: సూర్యకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి: అశ్విన్