ఐపీఎల్ 2026 వేళ.. బీసీసీఐ సరికొత్త నిబంధనలు!
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:57 AM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026.. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టోర్నీ ఆరంభానికి ముందే జట్లు పాటించాల్సిన ప్రాక్టీస్ సెషన్లు, పిచ్ నిర్వహణకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ప్రాక్టీస్ సెషన్ రూల్స్..
ఒక జట్టు ఉపయోగించిన పిచ్‌లు, నెట్స్‌లను ఇతర జట్లు ఉపయోగించకూడదు. ప్రతి సెషన్‌కు తాజాగా సిద్ధం చేసిన పిచ్‌లను తప్పనిసరిగా అందించాలి.
మ్యాచ్ జరిగే రోజు ప్రాక్టీస్‌కు అనుమతి లేదు. ప్రధాన ప్రాంగణంలో ఎలాంటి ఫిట్‌నెట్ టెస్ట్ జరగదు.
ప్రాక్టీస్ రోజుల్లో గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూమ్, మైదానంలోకి అనుమతిస్తారు.
ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు వేరే వాహనంలోనే ప్రయాణించాలి. హాస్పిటాలిటీ ఏరియా నుంచి జట్టు ప్రాక్టీస్‌ను వీక్షించే అవకాశం వీరికి కల్పిస్తారు.
త్రో డౌన్ స్పెషలిస్ట్, నెట్ బౌలర్లు వంటి అదనపు సహాయక సిబ్బంది జాబితా వివరాలను బీసీసీఐకి సమర్పించాలి. ఆమోదం పొందిన తర్వాతే వీరికి గుర్తింపు పత్రాలు జారీ చేస్తారు.
ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు వచ్చేటప్పుడు టీమ్ బస్‌ను మాత్రమే ఉపయోగించాలి.
మ్యాచ్ డే రూల్స్..
పీఎంవోఏ నుంచి గుర్తింపు పొందిన సిబ్బంది మ్యాచ్ రోజు తమ ఐడీని తీసుకురావడం తప్పనిసరి.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ దక్కించుకున్న ప్లేయర్లు.. అవి మ్యాచ్ సమయంలో కచ్చితంగా ధరించాలి.
మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఫ్లాపీలు, స్లీవ్ లెస్ జెర్సీలు ధరించేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదు. రూల్ పాటించకపోతే తొలిసారి హెచ్చరిక, రెండో సారి జరిమానా విధిస్తారు.
ప్లేయర్ల జెర్సీ నంబర్లలో మార్పు ఉంటే.. ఆయా ఫ్రాంచైజీలు నిబంధనల ప్రకారం 24 గంటల ముందే ఆ వివరాలు తెలియజేయాలి.
ఇవి కూడా చదవండి:
ఒక కోచ్‌గా గంభీర్‌కు అసలైన సవాళ్లు ముందున్నాయి: సౌరభ్ గంగూలీ
ఐపీఎల్ 2026: సూర్యకు ఎంఐ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి: అశ్విన్