Share News

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:51 PM

మండలంలోని తిప్పనపల్లిలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఎస్‌కే జాఫర్‌ కేసు పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. సాధారణ మృతికాదని, హత్యేనని తేలింది.

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

  • మలుపు తిరిగిన తిప్పనపల్లి అనుమానాస్పద మృతి కేసు

చండ్రుగొండ(భద్రాద్రి కొత్తగూడెం): మండలంలోని తిప్పనపల్లిలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ఎస్‌కే జాఫర్‌ కేసు పోలీసుల విచారణలో మలుపు తిరిగింది. సాధారణ మృతికాదని, హత్యేనని తేలింది. ఈ కేసు పూర్వాపరాలపై జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ చండ్రుగొండ స్టేషన్‌లో సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. తిప్పనపల్లికి చెందిన ఎస్‌కే జాఫర్‌ ఈ నెల 11న అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ విషయాన్ని మృతుడు భార్య ఖతీజా తాగిన మత్తులో ఉన్న తన భర్త (జాఫర్‌) మృతి చెందాడని కుటుంబ సభ్యులకు తెలిపింది.


bcm4.jpgదీంతో 12న జాఫర్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. అనంతర మృతుడి కుమార్తె (ఎనిమిది సంవత్సరాల వయస్సు) తన తండ్రిని ‘మా అమ్మ, మరో వ్యక్తితో కలిసి దిండుతో అదిమి కొట్టారు’ అని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీనిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి పంపామని, ఆ నివేదికలో హత్య అని తేలిందన్నారు.


ఆ కోణంలో ఆవిచారణ చేయగా ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన షేక్‌ మీరాసాహెబ్‌తో మృతుడి భార్య ఖతీజాకు గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉందని, ఇందుకు భర్త జాఫర్‌ అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశ్యంతో ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులకు వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు ఈ సమావేశంలో ఎస్సై శివరామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రెచ్చిపోతున్న మట్టి మాఫియా!

వికారాబాద్‌ డిపోలో నిలిచిన అద్దె బస్సులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 24 , 2026 | 12:51 PM