Share News

హెచ్‌సీయూకు అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:53 AM

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కు మరోమారు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

హెచ్‌సీయూకు అంతర్జాతీయ గుర్తింపు

  • వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో భాషాశాస్త్రానికి 150వ స్థానం

  • మొత్తం ఆరు సబ్జెక్టుల్లో అత్యుత్తమ ర్యాంకులు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కు మరోమారు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను విశ్లేషించే క్యూఎస్‌ (క్వాక్వారెల్లి సైమండ్స్‌) సంస్థ బుధవారం విడుదల చేసిన ‘వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ బై సబ్జెక్ట్‌’ 2026 సంచికలో హెచ్‌సీయూలో నిర్వహిస్తున్న ఏడు సబ్జెక్టులకు ర్యాంకులు లభించాయి. 2026 గణాంకాల ప్రకారం దేశంలోని 99 సంస్థల్లోని 529 సబ్జెక్టులకు క్యూఎస్‌ ర్యాంకులు లభించాయి. హెచ్‌సీయూ నుంచి గతేడాది కన్నా ఈ ఏడాది మూడు సబ్జెక్టులకు ర్యాంకులు మెరుగవగా, మరో మూడు సబ్జెక్టుల ర్యాంకింగ్స్‌ స్థిరంగా ఉండడం గమనార్హం.


city1.2.jpgనిలకడకు నిదర్శనం: వీసీ అనురాధ

క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ 2026 ఫలితాలపై యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వైస్‌చాన్స్‌లర్‌ అనురాధ(Anuradha) స్పందిస్తూ, విశ్వవిద్యాలయం నిలకడగా సాధిస్తున్న ర్యాంకులు తమకు గర్వకారణమన్నారు. ఈ విజయాలతో తాము సంతృప్తి చెందడం లేదని, మరిన్ని సబ్జెక్టులను చేర్చడం ద్వారా హెచ్‌సీయూ ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎం రేవంత్‌ కేరళ పర్యటన రద్దు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2026 | 06:53 AM