Share News

‘హోర్ముజ్‌’లో పాక్‌కు పరాభవం.. కంటైనర్‌ వెనక్కి

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:24 AM

పాకిస్థాన్‌కు హోర్ముజ్‌ జలసంధిలో చేదు అనుభవం ఎదురైంది. ఆ జలసంధి గుండా కరాచీకి వెళ్లాల్సిన కంటైనర్‌ నౌక ‘సెలెన్‌’ను...

‘హోర్ముజ్‌’లో పాక్‌కు పరాభవం.. కంటైనర్‌ వెనక్కి

టెహ్రాన్‌, మార్చి 25: పాకిస్థాన్‌కు హోర్ముజ్‌ జలసంధిలో చేదు అనుభవం ఎదురైంది. ఆ జలసంధి గుండా కరాచీకి వెళ్లాల్సిన కంటైనర్‌ నౌక ‘సెలెన్‌’ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ(ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌) నావికాదళం వెనక్కి పంపింది. హోర్ముజ్‌ జలసంధి గుండా ఆ నౌక ప్రయాణించేందుకు అనుమతి పొందడంలో పాకిస్థాన్‌ విఫలమైందని కాబూల్‌లోని ఇరాన్‌ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. హోర్ముజ్‌ జలసంధి గుండా ఏ నౌక వెళ్లాలన్నా ఇరాన్‌కు చెందిన నౌకాయాన అధికారులతో పూర్తి సమన్వయం అవసరమని తేల్చిచెప్పింది. చట్టపరమైన ప్రోటోకాల్స్‌ పాటించకపోవడం వల్లే నౌకను వెనక్కి పంపామని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 06:24 AM