Share News

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సిద్ధం

ABN , Publish Date - Feb 11 , 2026 | 08:33 AM

ప్రైవేటు అటానమస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్‌ నెలలో ఎఫ్‌ఎ్‌ఫసీ తనిఖీలు షెడ్యూల్‌ చేయనుండగా, అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సిద్ధం

హైదరాబాద్‌ సిటీ: ప్రైవేటు అటానమస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్‌ నెలలో ఎఫ్‌ఎ్‌ఫసీ తనిఖీలు షెడ్యూల్‌ చేయనుండగా, అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. అఫిలియేషన్‌ నిబంధనలపై కళాశాలల సిబ్బందికి అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 12న ప్రిన్సిపాల్స్‌తో వీసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు అకడమిక్‌ ఆడిట్‌ విభాగం మంగళవారం సర్క్యులర్‌ జారీ చేసింది.


city4.2.jpgఅటానమస్‌ కళాశాలల నుంచి ప్రిన్సిపాల్‌, పరీక్షల కంట్రోలర్‌, రీసెర్చ్‌ కో ఆర్డినేటర్‌, ఒక సీనియర్‌ ఫ్యాకల్టీ రావాలని, 12న మధ్యాహ్నం 2.45 గంటలకు జేఎన్‌ ఆడిటోరియంలో సమావేశం జరుగుతుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2026 | 08:33 AM