Share News

చూసిన కొద్దీ పుణ్యం... చేసిన కొద్దీ భాగ్యం...

ABN , Publish Date - Mar 22 , 2026 | 10:10 AM

ప్రతీ ఏడాది అందరూ సమైక్యంగా ఒకచోట చేరి శ్రీరామనవమి ఉత్సవం జరుపుకుంటారు. ఎంతోమంది దేవతలు ఉండగా, కేవలం సీతారాముల కల్యాణం మాత్రమే ఏటేటా ఎందుకిలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారనే సందేహం కలగొచ్చు.

చూసిన కొద్దీ పుణ్యం... చేసిన కొద్దీ భాగ్యం...

ప్రతీ ఏడాది అందరూ సమైక్యంగా ఒకచోట చేరి శ్రీరామనవమి ఉత్సవం జరుపుకుంటారు. ఎంతోమంది దేవతలు ఉండగా, కేవలం సీతారాముల కల్యాణం మాత్రమే ఏటేటా ఎందుకిలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారనే సందేహం కలగొచ్చు. ఆ సందేహానికి సమాధానం ఈ కల్యాణ క్రతువులోనే కనిపిస్తుంది.

సీతారాముల కల్యాణం అనేది కేవలం ఒక పౌరాణిక ఘట్టం మాత్రమే కాదు, అది లోక కల్యాణం కోసం జరిగే పవిత్ర సంకల్పం. ప్రతీ ఏడాది చైత్ర శుద్ధ నవమి (శ్రీరామనవమి) నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో సీతారాముల కల్యాణాన్ని జరుపుకుంటారు. ఈ క్రతువును ప్రతీ ఏటా నిర్వహించడం వెనుక ఆధ్యాత్మిక, సామాజిక, ధార్మిక కారణాలున్నాయి.


  • లోక కల్యాణం - విశ్వ శాంతి

రామాయణ పరమార్థం ప్రకారం, రాముడు ధర్మానికి నిలువెత్తు విగ్రహ రూపం (రామో విగ్రహవాన్‌ ధర్మః). సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఈ ఇద్దరి కలయిక ప్రకృతి పురుషుల కలయిక. రావణ సంహారం వంటి లోక కల్యాణ కార్యాలు జరగటానికి సీతారాముల వివాహం ఒక ప్రధాన కారణం. అందుకే ఈ కల్యాణం చూడటం వల్ల లోకంలోని అశాంతి నశించి, సుభిక్షం కలుగుతుందని నమ్మకం. ఈ కారణంతోనే సీతారాముల కల్యాణాన్ని ‘లోక కల్యాణ కారకం’ అంటారు.


book5.2.jpg

  • ఆదర్శ దాంపత్యానికి ప్రతీక

కుటుంబ వ్యవస్థ సజావుగా సాగడానికి సీతారాముల జీవితం ఒక ప్రత్యక్ష పాఠం లాంటిది. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండటం, త్యాగనిరతి, పరస్పర గౌరవంతో ఎలా ఉండాలో ఈ కల్యాణం గుర్తుచేస్తుంది. భార్యాభర్తలు ధర్మ మార్గంలో నడిేస్త ఆ ఇల్లు రామరాజ్యం అవుతుందని చెప్పడమే ఈ ఉత్సవం వెనుక ఉన్న పరమార్థం.

  • భక్తి భావన - ఆధ్యాత్మిక ఉన్నతి

ప్రతీ ఏడాది ఈ ఉత్సవం జరపడం వల్ల భక్తులలో దైవ చింతన పెరుగుతుంది. మనిషి తన అవిశ్రాంత జీవితంలో ఆధ్యాత్మికతను మర్చిపోకుండా ఉండటానికి ఇటువంటి పండుగలు బాగా ఉపకరిస్తాయి. ఊరిలో అందరూ కలిసి కల్యాణాన్ని నిర్వహించడం వల్ల సామాజిక ఐక్యత, సోదరభావం పెంపొందుతాయి.


  • ప్రకృతి ఆరాధన

శ్రీరామనవమి వసంత రుతువులో వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి కొత్త చిగుళ్లతో కళకళలాడుతుంటుంది. ఇలా కళకళలాడే ప్రకృతిని ఆరాధిేస్త మానవ సమాజం అన్ని కోణాల నుంచి శాంతి పొందుతుంది. అదే విశ్వశాంతికి సోపానమవుతుంది. అలాగే ఆధ్యాత్మికపరంగా చూేస్త ప్రకృతి (సీత) పరమాత్మ లేదా పురుషుడి (రాముడు)తో కలిేస సమయంగా ఈ కల్యాణ సమయాన్ని సంకేతాత్మకంగా భావిస్తారు పెద్దలు. అందుకే ఈ సమయంలో కల్యాణం చేయడం శుభప్రదం. సీతారాముల కల్యాణం అంటే కేవలం బొమ్మల పెళ్లి కాదు, అది ఒక పక్క ధర్మం, మరోపక్క శక్తి... ఈ రెండింటి సమ్మేళనం. ప్రతీ ఏటా ఈ వేడుకను జరుపుకోవడం ద్వారా మన సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరానికి అందిస్తున్నట్లవుతుంది. అంతేగాక, అంతరాత్మలో ఉన్న రాముడిని అంటే నిశ్చల తత్త్వాన్ని, సీతను అంటే శాంతిని జాగృతం చేయడానికి ప్రతీక అవుతుంది.


భక్త రామదాసు ఏర్పరచిన సంప్రదాయం

అప్పుడెప్పుడో త్రేతాయుగంలోనిది రామాయణం. అసలు అదంతా కథేమో? రాముడనే దేముడు నిజంగా ఉన్నాడా అంటే దానికి సమాధానమే భద్రాద్రి. భద్రాచలం దక్షిణ అయోధ్య అని కూడా పేరు పొందింది. ఇక్కడ ప్రతీ ఏడాది జరిగే కల్యాణోత్సవాన్నే అందరూ అనుసరిస్తుంటారు. రాములవారి కల్యాణం దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దీని వెనుక చారిత్రక, ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆధారాలు, ఉదాహరణలున్నాయి.


book5.4.jpgభద్రాచల రామాలయ నిర్మాణకర్త కంచెర్ల గోపన్న (భక్త రామదాసు), 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, సీతారాముల కల్యాణాన్ని ఒక మహోత్సవంగా ప్రారంభించారు. అప్పటినుంచి అదే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు రావటం భద్రాచల కల్యాణానికి ఉన్న అతిపెద్ద విశిష్టత. గోపన్నను బంధించిన తానీషా... రాముడి మహిమను తెలుసుకుని, ప్రాయశ్చిత్తంగా కల్యాణానికి ముత్యాలను పంపడం ప్రారంభించారు. తానీషాకు రామలక్ష్మణులు కనిపించింది ఈ యుగంలోనే. ఇప్పటికన్నా ఇంకొంచెం ముందుగానే దేవుడైన రాముడు కనిపించిన విషయాన్ని


గుర్తు చేస్తుంది ఈ కల్యాణం. నాటి కల్యాణ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, నేటికీ తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా మంత్రులు అధికారికంగా పట్టువస్ర్తాలను, ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పిస్తారు. దేముడున్నాడని నమ్మిన భక్తులను సమయానికొచ్చి రక్షిస్తుంటాడని ఇది తెలిసిన ఎవరైనా నమ్మి తీరాల్సిందే మరి.

- శ్రీమల్లి, 98485 43520


ఈ వార్తలు కూడా చదవండి:

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2026 | 10:10 AM