Share News

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:59 AM

తెలంగాణ ఆర్టీసీలో 198 ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు...

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీలో 198 ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీసు నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థు లు తమ హాల్‌టికెట్లను ఈ నెల 23న ఉదయం 8గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైతే 9391005006 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరని తెలిపారు.

Updated Date - Mar 22 , 2026 | 05:59 AM