Share News

ఎంత పెద్ద చాక్లెట్‌ రైలో...

ABN , Publish Date - Mar 22 , 2026 | 09:32 AM

చాక్లెట్‌తో ప్రత్యేక సందర్భాల్లో రకరకాల ఆకారాలను రూపొందించడం చూస్తుం టాం. క్రిస్మస్‌ ట్రీ, శాంతాక్లాజ్‌, భవం తులు, ప్రసిద్ధ వ్యక్తుల చాక్లెట్‌ శిల్పాలు చూసి ఆశ్చర్యపోతుంటాం.

ఎంత పెద్ద చాక్లెట్‌ రైలో...

చాక్లెట్‌తో ప్రత్యేక సందర్భాల్లో రకరకాల ఆకారాలను రూపొందించడం చూస్తుం టాం. క్రిస్మస్‌ ట్రీ, శాంతాక్లాజ్‌, భవం తులు, ప్రసిద్ధ వ్యక్తుల చాక్లెట్‌ శిల్పాలు చూసి ఆశ్చర్యపోతుంటాం. అయితే ఈసారి ఏకంగా ఒక రికార్డు రైలును రూపొందించారు. ఆ విశేషాలే ఇవి...

ప్లాట్‌ఫాంపైకి రైలు వచ్చిందంటే తోసుకుంటూ ఎక్కేస్తారు. కానీ ఈ రైలులోకి మాత్రం ఒక్కరూ ఎక్కరు. ఇంకా చెప్పాలంటే ‘అబ్బ... భలేగా ఉంది’ అంటూ నాలుక చప్పరిస్తారు. ఎందుకంటే ఇది చాక్లెట్‌తో తయారుచేసిన రైలు. ‘చాలా రకాల రైళ్లు చూశాం కానీ, చాక్లెట్‌ రైలు చూడటం ఇదే మొదటిసారి’ అంటూ అధికారులు సైతం ‘గిన్నిస్‌ వరల్డ్‌’ రికార్డుల్లో నమోదు చేశారు.


ఇటలీలోని మిలన్‌ నగరానికి చెందిన ఆండ్రూ ఫర్రూజియా అనే కళాకారుడు చాక్లెట్‌తో ఏకంగా రైలును తయారుచేశాడు. రైలంటే పిల్లలు ఆడుకునే బొమ్మ రైలులా చిన్నదేం కాదు. 181 అడుగుల 3 అంగుళాల పొడవున్న రైలు. అలాగని డీటెయిల్స్‌ను మిస్సవ్వలేదాయన. రైలు ఇంజన్‌తో పాటు బోగీలు కూడా తయారుచేశాడు. బోగీల్లో ప్రయాణికుల కోసం అన్నట్టుగా సీట్లు కూడా కనిపిస్తాయి. రైలు ఇంజన్‌, బోగీలు, సీటింగ్‌, టేబుళ్ళు... ఇలా ప్రతిదీ చాక్లెట్‌తోనే తయారుచేశాడు. ఈ చాక్లెట్‌ గురించి బయటి ప్రపంచానికి తెలియడంతో దానిని చూసేందుకు జనం క్యూ కట్టారు. ఆండ్రూ చాక్లెట్‌తో రైలు తయారుచేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఒకసారి రైలు, మరోసారి ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన బుర్జ్‌ ఖలీఫా భవనం ప్రతిమలను తయారుచేశాడు.


book4.2.jpgవందల కిలోల చాక్లెట్‌...

భారీ చాక్లెట్‌ రైలును తయారుచేసేందుకు పెద్ద కసరత్తే చేసింది ఆండ్రూ టీమ్‌. కొన్ని వందల కిలోల చాక్లెట్‌ను ఇందుకోసం ఉపయోగించారు. ఒక ఇంజను, 22 బోగీలు ఉంటే.... ఒక్కో బోగీ తయారీ కోసం 160 కిలోల చాక్లెట్‌ను వాడారు. రైలు చక్రాలు కూడా రూపొందించారు. సుమారు 5 వేల చాక్లెట్లను సేకరించి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి, జాగ్రత్తగా మిలన్‌కు తరలించారు. ఐదు నెలల పాటు కష్టపడి ప్రపంచంలోనే అతి పొడవైన చాక్లెట్‌ ప్రతిమను తయారుచేశారు. దీనిని తయారుచేయడంలో ‘మాల్టా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం స్టడీస్‌’కు చెందిన విద్యార్థులు ఆండ్రూకు సహాయపడ్డారు. ఇప్పటిదాకా చాక్లెట్‌తో ఇంత పెద్ద రైలు ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదు. అందుకే ఈ రైలు ‘గిన్నిస్‌ బుక్‌’లో స్థానం సంపాదించింది.


book4.3.jpgచూశారు కానీ తినలేకపోయారు...

ఆండ్రూ మాల్టాలోని ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం స్టడీస్‌’లో కలినరీ ఆర్ట్స్‌ అండ్‌ చాక్లెట్‌ మేకింగ్‌లో సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఆయన 2012లో111 అడుగుల చాక్లెట్‌ రైలును తయారుచేసి బ్రస్సెల్స్‌లో ప్రదర్శించాడు. ఆ తరువాత రెండేళ్లకు అంటే 2014లో 44 అడుగుల ఎత్తైన చాక్లెట్‌ బుర్జ్‌ ఖలీఫాను రూపొందించాడు. ఇది అప్పట్లో ప్రపంచంలోనే ఎత్తైన చాక్లెట్‌ శిల్పంగా


book4.4.jpgగుర్తింపు పొందింది. సాధారణంగా చాక్లెట్‌ కళాకృతులను ప్రదర్శన తర్వాత అందరూ తినడానికి పంచుతారు. అయితే ఆండ్రూ తయారుచేసిన ఈ రికార్డ్‌ చాక్లెట్‌ రైలు కొన్ని వారాల పాటు ప్రజల సందర్శనార్థం అవుట్‌డోర్‌లో ఉంచడంతో... ఎవరూ తినడానికి పనికిరాకుండా పోయింది. ఏదైతేనేం ఆండ్రూ క్రియేటివిటీకి అందరూ ఫిదా అయ్యారు. సోషల్‌ మీడియాలో ఆండ్రూపై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. ఒక రైలును చాక్లెట్‌తో ఇంత డీటెయిల్డ్‌గా రూపొందించిన వారు ఎవరూ లేరు. అందుకే ఈ సృష్టికి గిన్నిస్‌ గౌరవం దక్కింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్ల తయారీ

ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Mar 22 , 2026 | 09:40 AM