Share News

ఢిల్లీ టీటీడీ ఆలయంలో 13 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:51 PM

ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో ఏప్రిల్ 28 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక సలహా కమిటీ సభ్యులు చర్చించారు.

ఢిల్లీ టీటీడీ ఆలయంలో 13 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
TTD Brahmotsavam

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో(Delhi TTD Temple) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఏప్రిల్ 28 నుంచి మే 10 వరకు 13 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. అంకురార్పణ మొదలు వాహన సేవలు, ఊంజల్ సేవ, రథోత్సవంతో ఘనంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 5న కల్యాణోత్సవం, మే 10న పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని వాహన సేవలను టీటీడీ అధికారులు సకాలంలో నిర్వహించనున్నారు.


బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై స్థానిక సలహా కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా ఢిల్లీ టీటీడీ దేవాలయం స్థానిక సలహా కమిటీ అధ్యక్షుడు సుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తెలుగు వారే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు బ్రహ్మోత్సవాలకు వస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు కూడా పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు. టీటీడీ ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో శ్రీవారికి కైంకర్యాలు, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని సుమంత్ రెడ్డి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు

జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు

Read Latest Devotional News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 12:54 PM