Share News

ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 03 , 2026 | 09:44 AM

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ఈనాటికీ అనుసరణీయమని సీఎం అన్నారు.

ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 3: క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా ఏసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుందామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో సీఎం పోస్టు చేశారు. మానవాళి పాప విమోచనం కోసం ఏసు తన ప్రాణాన్ని త్యాగం చేశారన్నారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ఈనాటికీ అనుసరణీయమని తెలిపారు. ప్రేమపాత్రమైన ఆయన జీవిత సందేశం మనకు ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ధర్మమార్గంలో నడుద్దాం: లోకేశ్

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘గుడ్ ఫ్రైడే మనకు ఏసుక్రీస్తు త్యాగాలను గుర్తుచేస్తుంది. మన ప్రవర్తన ద్వారా క్రీస్తు త్యాగాన్ని గౌరవిస్తూ.. ప్రేమ, శాంతి, దయను వ్యాప్తి చేద్దాం. ఈ పవిత్రమైన రోజున క్రీస్తును స్మరిస్తూ, ధర్మ మార్గంలో నడుద్దాం’ అంటూ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

ఒకే మాట.. ‘రాజధాని అమరావతి’

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 10:32 AM