దారుణం.. భార్య ముక్కు, చెంపలు కొరికేసిన భర్త
ABN , Publish Date - Apr 03 , 2026 | 09:57 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య ముక్కు, చెంపలు కొరికేశాడు. ముఖంపై దాదాపు పది గాయాలు చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
లక్నో, ఏప్రిల్ 3: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్య ముక్కు, చెంపలు కొరికేశాడు. ముఖంపై దాదాపు పది గాయాలు చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఝాన్సీకి చెందిన ఫూల్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన పనాతో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైన తర్వాత మూడు నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. బుధవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
గొడవ సందర్భంగా ఫూల్ ఆగ్రహంతో భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ముఖంపై పది చోట్ల గాయాలు చేశాడు. ఆమె ముక్కు, చెంపలను కొరికేశాడు. ముక్కు పూర్తిగా ఊడిపోయింది. తీవ్ర గాయాలపాలైన పనాను కుటుంబసభ్యులు స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ ఆమె ముఖంపై ఉన్న గాయాలకు కుట్లు వేశాడు. మెరుగైన వైద్యం కోసం ఝాన్సీలోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించాడు. కుటుంబసభ్యులు ఆమెను మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు ముఖం సాధారణ స్థితిలోకి రావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పారు. పనా ప్రస్తుతం వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై బాధితురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్న క్రైస్తవులు