ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్న క్రైస్తవులు
ABN , Publish Date - Apr 03 , 2026 | 09:30 AM
దేశవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఇవాళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్నారు. క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 3: దేశవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఇవాళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్నారు. క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు.

గుడ్ ఫ్రైడే రోజునైన ఇవాళ చర్చిలలో గంటలు మ్రోగడం లేదు. వాయిద్య సంగీతం లేకుండా కేవలం భక్తి గీతాలను ఆలపిస్తున్నారు. సిలువను ముద్దుపెట్టుకోవడం, క్రీస్తు త్యాగాన్ని స్మరించుకోవడం ఈ రోజు చర్చిలలో ప్రధాన ఘట్టాలు.

పశ్చిమ బెంగాల్ రాజధానిలో తెల్లవారుజాము నుండే భక్తులు సెయింట్ పాల్స్ కేథడ్రల్ వంటి ప్రముఖ చర్చిలకు పోటెత్తారు. నగరం నలుమూలల 'వే ఆఫ్ ది క్రాస్' (సిలువ మార్గం) ఊరేగింపులు నిర్వహించారు. క్రీస్తు పడిన శ్రమలను గుర్తుచేసుకుంటూ భక్తులు మౌన ప్రదర్శనలు చేపట్టారు.

దేశ రాజధాని ఢిల్లీలోని శాక్రెడ్ హార్ట్ కేథడ్రల్‌లో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.

దక్షిణ భారతం లోనూ గుడ్ ఫ్రైడే భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్రీస్తు ఏడు మాటలపై ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించారు.
