జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:42 AM
మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. అమరావతిపై జగన్‌లా ఇన్ని ప్రకటనలు చేసిన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 3: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(MLA Ganta Srinivas Rao). ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan reddy) వివిధ సందర్భాల్లో రాజధాని గురించి మాట్లాడిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే విడుదల చేశారు. అమరావతిపై జగన్ మాట్లాడిన మాటలు చూస్తే ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. అమరావతిపై జగన్‌లా ఇన్ని ప్రకటనలు చేసిన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని అంగీకరించారని.. గెలిచిన తర్వాత మూడు రాజధానులు అన్నారని గంటా శ్రీనివాస్ తెలిపారు. అమరావతి తీర్మానంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కూడా హాజరుకాలేదన్నారు. పార్లమెంట్‌లో అమరావతికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని తెలిపారు. మొన్నటి వరకు ఉత్తరాంధ్ర అన్న జగన్.. ఇప్పుడు మావిగన్ అని అంటున్నారని అన్నారు. మాజీ సీఎంకు ఏ అంశంపైనా ఒక స్థిరమైన అభిప్రాయం లేదని ఎమ్మెల్యే విమర్శించారు.
వైసీపీకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు తీర్పు ఇచ్చినా జగన్ మారడం లేదన్నారు ఎమ్మెల్యే. ఏప్రిల్ 15వ తేదీ లోపు గూగుల్ శంకుస్థాపన చేయొచ్చని వెల్లడించారు. అమరావతి కలల రాజధానిని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అమరావతి ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అంతా చూశారన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో జగన్ రాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేరని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు
ఏసుక్రీస్తు సందేశం అందరికీ ఆదర్శం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News