Share News

అందమైన మోముతో భక్తకోటికి కటాక్షం

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:47 AM

కలియుగ వైకుంఠనాధుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి భూలోక వైకుంఠంగా పేరుపెందిన వేంకటాద్రిపై స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా ఆవిర్భాంచాడు.

అందమైన మోముతో భక్తకోటికి కటాక్షం
Tirumala Tirupati

కలియుగ వైకుంఠనాధుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి భూలోక వైకుంఠంగా పేరుపెందిన వేంకటాద్రిపై స్వయంవ్యక్త సాలిగ్రామ శిలామూర్తిగా ఆవిర్భాంచాడు. ఈ గర్భాలయ మూర్తిని ధృవమూర్తి, మూలవిరాట్టు, మూలమూర్తి అని పిలుస్తుంటారు. అత్యంత పవిత్రమైన ఆనంద నిలయ గర్భాలయంలో దివ్యమంగళ తేజోమూర్తిగా స్థిరపడ్డాడు.

పద్మపీఠం నుంచి శిఖామణి వరకు శ్రీనివాసుడి ఎత్తు ఎనిమిది అడుగుల ఆరు అంగుళాలు. సుకుమారమైన పెదవులతో నిత్యం చిరు నవ్వుతోనే భ క్తకోటికి దర్శనభాగ్యాన్ని కలిగిస్తూ భక్తులకు కొంగుబంగార మయ్యాడు. పచ్చకర్పూరపు శ్వేతవర్ణ కాంతుల నడుమ ఈనల్లనయ్య... దేదీప్యమానంగా వెలుగుతూ ధనిక, పేద అనే భేదాలు లేకుండా శరణుస్వామి అని వచ్చిన తన భక్తులకు దీవెనలు అందిస్తూ సప్తగిరులుపై కొలువుదీరాడు.


గర్భాలయంలోని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఏలుమైలై, వెంకన్న, గోవిందుడు, శ్రీనివాసడు, బాలాజీ, నారాయణుడు, పెరుమాళ్‌ ఇలా అనేక పేర్లతో భక్తుల ఇష్టదైవాన్ని కొలుస్తుంటారు. ఆనంద నిలయం కిందనున్న గర్భాలయం 12.9 అడుగుల చతురస్రాకారంలో ఉంటుంది. దశలవారీగా గర్భాలయం ప్రాకారాన్ని నిర్మించటంతో గోడలు 7.2 అడుగుల మందం ఉంటాయి. స్వామిపాదాల కింద శ్రీచక్రముంటుంది. అలంకారప్రియుడైన శ్రీనివాసుడి పెదవులు నిత్యం నువ్వుతూనే ఉండటాన్ని గమమనించొచ్చు.


zz.jpgఅలానే స్వామి మోము స్ర్తీకంటే అందంగా ఉంటుందని ఆగమపండితులు చెప్తుంటారు. అట్టి గర్భాలయంలోని మూలమూర్తి శక్తిని మరింత పెంపొందించేందుకు 12 ఏళ్లకోసారి మహాసంప్రోక్షణ క్రతువును శాస్ర్తోక్తంగా నిర్వహిస్తారు. ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేసిన మిశ్రమాన్ని శిల్పాచార్యులు మూలమూర్తి పాదపీఠం, పద్మపీఠం మధ్యలో ఉంచుతారు. ఈ మహాద్భుతమైన క్రతువుతో మరో 12 ఏళ్లు స్వామి తన తేజస్సుతో పాటు దృఢంగా ఉంటూ అనేక శక్తులతో భక్తులను కటాక్షిస్తాడని ఆగమపండితులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంటేనే!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 08:47 AM