Share News

దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న ప్రతిపక్షాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:19 AM

‘ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టి వీధుల్లోకి లాగుతూ దేశప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి’ అని ...

దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న ప్రతిపక్షాలు

  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉంగుటూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టి వీధుల్లోకి లాగుతూ దేశప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయి’ అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన తాజా రాజకీయ పరిణామాలు, విపక్షాలు చేస్తున్న నిరసన ప్రదర్శనలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం తప్పుకాదని, అవి హింసాత్మకంగా మారకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆ విజయాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోతే ఈవీఎంలను నిందించడం, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ , ప్రధాన మంత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ వస్తున్న ఆరోపణలు కేవలం అపోహ మాత్రమేనన్నారు. ఏపీలో కొందరు ఎమ్మెల్యేలు తామే సర్వాధికారులమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే బిల్లుల ఆమోదానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సూచించారు. మోదీ, చంద్రబాబు జనంతో మమేకమవుతున్నారని ప్రశంసించారు. ప్రజాప్రయోజనాలు కాపాడినవారే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 05:19 AM