Simhachalam Temple: సింహాచలం అప్పన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం..
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:00 AM
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు. అప్పన్నస్వామిని దర్శించుకున్న అనంతరం వారికి తోచిన కానుకలను సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో విశాఖపట్నం సింహాచలం అప్పన్నస్వామి హుండీకి భారీ ఆదాయం వచ్చింది..
విశాఖపట్నం, జనవరి8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం సింహాచలం ఆలయం (Simhachalam Appanna Temple) భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఈ ఆలయానికి రోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం కోసం భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా తరలివస్తారు. స్వామిని దర్శించిన తర్వాత వారికి తోచిన కానుకలను స్వచ్ఛందంగా సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది.
రికార్డ్ స్థాయికి ఆదాయం...
ఈ విధంగా ఆలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత 14 రోజుల్లో రూ.1,08,36,662 నగదును భక్తులు సమర్పించారు. దీంతో హుండీ ఆదాయం రికార్డ్ స్థాయికి చేరింది. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాలు, సేవల కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం.
భక్తుల స్పందన..
వైకుంఠ ద్వాదశి సందర్భంగా కూడా భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలను సజావుగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరావడంతో, ప్రత్యేక క్యూలైన్లు, ఆన్‌లైన్ స్లాట్లు, టోకెన్ విధానం వంటి తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. రోజూ లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించడం కోసం ఆలయ సిబ్బంది సమన్వయం చేశారు. ఈ ప్రత్యేక దర్శనాలు భక్తుల నుంచి విశేష స్పందనను పొందాయి. భక్తుల నుంచి వస్తున్న స్పందనను చూసి.. సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెయిన్ అలర్ట్... వాయుగుండం ప్రభావంతో వర్షాలు
భక్తులకు అలర్ట్.. ఆ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..
Read Latest AP News And Telugu News