కోనసీమలో కరెన్సీ అమ్మవారు.. రూ.4.5 కోట్ల నోట్లతో కన్యకా పరమేశ్వరి అలంకరణ
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:36 AM
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కోనసీమలో కరెన్సీ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మెయిన్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అమలాపురం, అక్టోబర్ 16: రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి రోజు వివిధ అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏపీలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక కోనసీమలో కరెన్సీ అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మెయిన్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈరోజు(శుక్రవారం) శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆలయంలోని ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయ ప్రాంతాలను కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ తోరణాల మధ్య అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. కొత్త కరెన్సీ నోట్ల మధ్య మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి...
బాసర క్షేత్రంలో వైభవంగా మూల నక్షత్ర పర్వదిన వేడుకలు
నేడు తిరుమలకు ప్రైవేటు వాహనాల బంద్
Read Latest Devotional News And Telugu News