Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:35 AM

వారఫలాలు..13 -19 సెప్టెంబర్‌ 2026, పి.ప్రసూనా రామన్‌

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే?
Weekly Horoscopes

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgకార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధి స్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగు తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgఅన్ని విధాలా అనుకూలమే. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ప్రముఖులకు చేరువవుతారు. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మధ్యవర్తిత్వం తగదు. మీ గౌరవానికి భంగం వాటిల్లే సూచనలున్నాయి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgవ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. మీ నిజాయితీపై ఎదుటివారికి నమ్మ కం కలుగుతుంది. సంప్రదింపులు మీ సమ క్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. ఆల యాలకు విరాళాలందిస్తారు. పలుకుబడి కలి గిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. నగదు డ్రా చేేసటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని నిశితంగా గమనించండి. కొత్త యత్నాలు చేపడతారు. పరిస్థ్థితులు అనుకూలిస్తాయి. పిల్లల మొండితనం చికాకు పరుస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgగ్రహస్థితి బాగుంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజన కరం. ఉల్లాసంగా గడుపుతారు. ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అప్రమ త్తంగా ఉండాల్సిన సమయం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆరోగ్యం కుదుటపడు తుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgతలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. వ్యవహారంలో సముచిత నిర్ణయం తీసు కుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందు తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgకార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగిం చండి. అవకాశాలు చేజారిపోతాయి. ఇదీ ఒకందుకు మంచికే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయస్తుల రాక చికాకుపరు స్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపుధనం గ్రహిస్తారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. పోయా యనుకున్న వస్తువులు లభ్యమవుతాయి.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgఅనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. చిన్న విష యానికే ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి, ధనం మితంగా వ్యయం చేయండి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgఅన్ని విధాలా యోగదాయకం. స్నేహసంబంధాలు బలపడతాయి. ఉత్సాహంగా కాలం గడుపుతారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆప్తులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కిట్టనివారితో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. కొత్త సమస్య ఎదురవుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. కన్సల్టెన్సీలను ఆశ్ర యించవద్దు. పిల్లలకు శుభఫలితాలున్నాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgకార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగు తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. సోదరులతో సంప్ర దింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు ప్రయోజన కరం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలుఏర్పడతాయి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgరావలసిన ధనం అందు తుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు పురమాయించ వద్దు. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవతలి వారి స్తోమతును క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపడి మాట ఇవ్వవద్దు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgపరిస్థితులు కొంతమేరకు చక్కబడతాయి. అనుకున్నది సాధిస్తారు. యత్నాలు మరింత ప్రోత్సాహకరంగా సాగు తాయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్‌ వేసు కుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధుత్వాలు బల పడతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఆరోగ్యం జాగ్రత్త. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. నిపుణులను సంప్రదిస్తారు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. అన్యమస్కంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. పనులు అర్ధాంతంగా ముగించవలసి వస్తుంది. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచ పాలన మారాలి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 07:35 AM