800 ఏళ్లనాటి బాల గణపతి శిల్పం
ABN , Publish Date - Sep 13 , 2026 | 07:05 AM
గౌరీ నందనుడు వినాయకుడి అరుదైన శిల్పం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని చనుబాలు తాగుతున్న 800 ఏళ్లనాటి బాల గణేశుడి అరుదైన ప్రతిమను ఆదిలాబాద్‌కు సమీపంలోని ...
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు12(ఆంధ్రజ్యోతి): గౌరీ నందనుడు వినాయకుడి అరుదైన శిల్పం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని చనుబాలు తాగుతున్న 800 ఏళ్లనాటి బాల గణేశుడి అరుదైన ప్రతిమను ఆదిలాబాద్‌కు సమీపంలోని చందా, శివారం గ్రామాల మధ్య రైలు కట్ట పక్కనున్న ఓ చెట్టుకింద స్థానిక ఉపాధ్యాయుడు పృధ్వీరాజ్ రొడ్డావార్ గుర్తించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఆ విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇలాంటి శిల్పం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెలుగుచూడడం ఇదే ప్రథమమని తెలిపారు. పార్వతీ సహిత బాల గణేశుడి శిల్పం సామాన్య శకం (సా.శ) 12వ శతాబ్దానికి చెందినదిగా ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌కు 14 కిలోమీటర్ల దూరంలోని జైనథ్‌లో సా.శ 1104లో మాల్వా దేశ రాకుమారుడైన పారమార జగదేవుడు నిర్మించిన లక్ష్మీనరసింహాలయ శిల్పాలకు బాల గణపతి విగ్రహానికి మధ్య పోలికలు, శిల్పశైలి ఆధారంగా ఈ అరుదైన ప్రతిమకూడా అదే కాలానికి చెందినదని చరిత్ర అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రీయింబర్స్‌మెంట్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News