ఆ రాశివారికి ఈ వారం ఆదాయం ఫుల్
ABN , Publish Date - Mar 29 , 2026 | 08:04 AM
ఈ వారం రాశి ఫలాలు.. అనుగ్రహం, 29 మార్చి - 4 ఏప్రిల్ 2026, పి.ప్రసూనా రామన్, ఆ రాశివారు ఈ వారం ఆదాయం ఫుల్
అనుగ్రహం
29 మార్చి - 4 ఏప్రిల్ 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ధనసమస్య ఎదురవుతుంది. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు పూర్తయ్యే సమయంలో ఆటంకాలు ఎదురవుతాయి. అప్రమత్తంగా అడుగేయాల్సిన సమయం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆహ్వానం అందుకుంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కార్యసిద్థికి ఓర్పు, పట్టుదల ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పనులు వేగవంతమ వుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారస పడతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మాట తీరు ఆకట్టుకుంటుంది. ఉల్లాసంగా గడుపు తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పనులు, బాధ్యతలు అప్పగించ వద్దు. పరిచయస్తుల రాకపోకలు అధికమవు తాయి. అనుకోని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు మెరుగుపడ తాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కొంత మొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆప్తుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో యత్నాలు కొనసాగిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యానికి చేరువలో ఉన్నారు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. పనులు, బాధ్య తలు స్వయంగా చూసుకోండి. ధనలాభం ఉంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందు కేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. వాహనం పిల్లలకివ్వవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
కొంతమేరకు ఆశాజనకం. రావలసిన ధనం అందుతుంది. బడ్జెట్ వేసు కుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అను కున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. అందరితోనూ మితంగా సంభాషిం చండి. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రాల్లో మార్పుచేర్పులు సాధ్యపడవు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
నిర్దేశిత పథకాలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. పనుల సానుకూల తకు మరింత కష్టపడాలి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సాయం ఆశించ వద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. మీ మాట తీరుఅదుపులో ఉంచుకోండి. ముఖ్య మైన పత్రాలు అందుతాయి. మీ ఇష్టాయి ష్టాలను కచ్చితంగా తెలియజేయండి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
స్థిరాస్తి ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పొదుపునకు అవ కాశం లేదు. పనులు అస్తవ్యస్తంగా సాగు తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచు కోండి. ఆవేశాలకు లోనుకావద్దు. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. కొత్త ఆలోచ నలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా వ్యవహరి స్తారు. పిల్లల ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. లైసెన్సులు, పర్మిట్‌ల రెన్యువ ల్‌లో జాప్యం తగదు. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. పరిస్థితులు మెరుగు పడతాయి. ప్రతికూలతలకు దీటుగా స్పంది స్తారు. మీ కష్టం వృథాకాదు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. లౌక్యంగా పనులు చక్క బెట్టుకుంటారు. ఖర్చులు సామాన్యం. ఆలయాలకు విరాళాలు సమర్పిస్తారు. ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. అందరితోనూ మితంగా సంభాషించండి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుం టారు. ఆత్మీయులతో తరుచూ సంభాషిస్తుం టారు. పిల్లల పై చదువులపై దృష్టి పెడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆచితూచి అడుగే యండి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకెడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కాను కలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనులు హడావుడిగా సాగు తాయి. ఒత్తిళ్లకు గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం
Read Latest Telangana News and National News