వేసవికి 26 ప్రత్యేక రైళ్లు..
ABN , Publish Date - Mar 29 , 2026 | 07:05 AM
వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-శ్రీకాకుళం మధ్య 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఆదివారం రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళానికి, ప్రతి సోమవారం రాత్రి 7.30 గంటలకు శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్‌కు ఈ ప్రత్యేక రైళ్లు బయల్దేరుతాయని సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు. మార్గమధ్యంలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.