Share News

పబ్‌, ఫాంహౌస్‌ల్లో పోటీలకైతే వస్తారా..?

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:09 AM

రాష్ట్ర యువతను క్రీడల వైపు మళ్లించి, ప్రోత్సహించడానికి శాసనసభ్యులకు సర్కారు క్రీడా పోటీలు నిర్వహిస్తుంటే..

పబ్‌, ఫాంహౌస్‌ల్లో పోటీలకైతే వస్తారా..?

  • కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్‌ మండిపాటు

హైదరాబాద్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువతను క్రీడల వైపు మళ్లించి, ప్రోత్సహించడానికి శాసనసభ్యులకు సర్కారు క్రీడా పోటీలు నిర్వహిస్తుంటే.. కేటీఆర్‌ వాటిని బహిష్కరించడమేంటని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. ‘మరి క్లబ్‌, పబ్‌, ఫాంహౌస్‌లలో పోటీలు జరిపితే వస్తారా..?’అంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆలోచన తీరు వేరని.. యువతను క్రీడల వైపు మళ్లించడానికి, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మరో విప్‌ విజయరమణారావు మాట్లాడుతూ.. రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై మాత్రమే కాదు.. పదేళ్లలో జరిగిన మైనింగ్‌ మాఫియాపై సీఎం విచారణకు ఆదేశించారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో బినామీల పేరిట జరిగిన మైనింగ్‌ దందా బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు.

Updated Date - Mar 29 , 2026 | 07:10 AM