ఆ రాశివారు ఈవారం నిర్విరామంగా శ్రమిస్తారు
ABN , Publish Date - Mar 22 , 2026 | 07:49 AM
రాశిఫలాలు.. ఆ రాశివారు ఈవారం నిర్విరామంగా శ్రమిస్తారు.. అనుగ్రహం, 22 - 28 మార్చి 2026, పి.ప్రసూనా రామన్
అనుగ్రహం
22 - 28 మార్చి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
శుభకార్యాన్ని వైభవంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. దూరపు బంధు త్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపు తారు. పనులు నిర్విరామంగా సాగుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆచితూచి అడుగే యండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
గ్రహస్థితి అనుకూలంగాఉంది. కలుపుగోలుగా మెలుగుతారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. నిర్దేశిత ప్రణాళికలతో అడుగు ముందుకేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నిరుత్సాహానికి గురికావద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. కొత్తయత్నాలు చేపడతారు. అవకా శాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఉల్లాసంగా గడుపుతారు. ఆహ్వానం అందుకుంటారు. సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. పనులు అర్థాంతంరంగా ముగిస్తారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
కొంతమేరకు ఆశాజనకం. ఆశ లొదిలేసుకున్న ధనం అందుతుంది. ప్రణాళి కలు వేసుకుంటారు. కొన్ని విషయాలు అను కున్నట్టే జరుగుతాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. నోటీసులు అందుకుం టారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావద్దు. సన్నిహితుల సలహా పాటించండి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తయత్నాలు చేపడతారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యూహాత్మ కంగా అడుగులేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేయవలసివస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగు తాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. ఖర్చులు విపరీతం. గృహమరమ్మతులు చేపడతారు. పక్కవారి నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ పని చేయబుద్ధి కాదు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. స్థిరచరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు బలపడతాయి. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. నోటీసులు అందుతాయి. చిన్న విషయానికే అసహనం చెందుతారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషిం చండి. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదు రవుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరో 260 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష
Read Latest Telangana News and National News