Share News

గోల్డ్, సిల్వర్ రేట్స్! నేడు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:49 AM

దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

గోల్డ్, సిల్వర్ రేట్స్! నేడు ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Prices in India on March 22

ఇంటర్నెట్ డెస్క్: కొంత కాలం క్రితం కళ్లు చెదిరే స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం అదే స్థాయిలో పడిపోతున్నాయి. సరికొత్త కనిష్ఠాల్ని నమోదు చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చ్ 22) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర రూ.1,45,970గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800కు చేరుకుంది. నగరంలో కిలో వెండి ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది (Gold, Silver Prices on March 22).

శనివారం భారత్‌లో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనమైన విషయం తెలిసిందే. 10 గ్రాముల 24 క్యారెట్ పసిడి ధర సగటున రూ.2,940ల మేర పడిపోయింది. కిలో వెండి ధర రూ.10 వేల మేర తగ్గింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు కోత ఉండదన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణంపై నెలకొన్న భయాలు వంటివి పసిడి, వెండి ధరలు తగ్గేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో పసిడి రూ.1.40 లక్షల నుంచి రూ.1.46 లక్షల మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.


ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పసిడి (24కే, 22కే) ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,48,580; ₹1,36,200;

  • ముంబై: ₹1,45,970; ₹1,33,800;

  • న్యూఢిల్లీ: ₹1,46,120; ₹1,33,950;

  • కోల్‌కతా: ₹1,45,970; ₹1,33,800;

  • బెంగళూరు: ₹1,45,970; ₹1,33,800;

  • హైదరాబాద్: ₹1,45,970; ₹1,33,800;

  • విజయవాడ: ₹1,45,970; ₹1,33,800;

  • కేరళ: ₹1,45,970; ₹1,33,800;

  • పుణే: ₹1,45,970; ₹1,33,800;

  • వడోదరా: ₹1,46,020; ₹1,33,850;

  • అహ్మదాబాద్: ₹1,46,020; ₹1,33,850;

వెండి (కిలో) ధరలు

  • చెన్నై: ₹2,50,000;

  • ముంబై: ₹2,45,000;

  • న్యూఢిల్లీ: ₹2,45,000;

  • కోల్‌కతా: ₹2,45,000;

  • బెంగళూరు: ₹2,45,000;

  • హైదరాబాద్: ₹2,50,000;

  • విజయవాడ: ₹2,50,000;

  • కేరళ: ₹2,50,000;

  • పుణే: ₹2,45,000;

  • వడోదరా: ₹2,45,000;

  • అహ్మదాబాద్: ₹2,45,000;


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఈ వార్తలూ చదవండి:

పోస్ట్‌ సేల్‌ డిస్కౌంట్‌ నిబంధనల్లో సడలింపు

డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి సెమాగ్లుటైడ్‌

Updated Date - Mar 22 , 2026 | 06:57 AM