డాక్టర్ రెడ్డీస్ నుంచి సెమాగ్లుటైడ్
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:31 AM
దేశీయ మార్కెట్లో జెనరిక్ సెమాగ్లుటైడ్ ఔషధాల వరద మొదలైంది. శనివారం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మాతో పాటు మొత్తం ఏడు కంపెనీలు....
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో జెనరిక్ సెమాగ్లుటైడ్ ఔషధాల వరద మొదలైంది. శనివారం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మాతో పాటు మొత్తం ఏడు కంపెనీలు తమ జెనరిక్ సెమాగ్లుటైడ్ ఔషధాన్ని వివిధ పేర్లతో విడుదల చేశాయి. టైప్ 2 డయాబెటిస్ చికిత్సతో పాటు ఊబకాయ నియంత్రణకు వాడే ఈ ఔషధ పేటెంట్ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో దేశీయ ఫార్మా కంపెనీలు చౌకగా జనరిక్ వెర్షన్‌లో ఈ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ సెమాగ్లుటైడ్ ఔషధాన్ని ఒబెడా పేరుతో ఇంజెక్షన్ రూపంలో రెండు డోసుల్లో విడుదల చేసింది. వారానికి ఒకసారి చొప్పున నెలకు సరిపోయే ఈ ఇంజక్షన్ పెన్ కనీస ధర రూ.4,200.
అదే బాటలో మరికొన్ని కంపెనీలు: సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, ఆల్కెమ్ ల్యాబ్స్ వంటి కంపెనీలు కూడా తమ జెనరిక్ సెమాగ్లుటైడ్ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేశాయి. గ్లెన్‌మార్క్ అందరి కంటే చౌకగా నెలకు రూ. 1,350 కనీస ధరతో గ్లిపిక్ పేరుతో దీన్ని విడుదల చేసింది.
ఈ వార్తలూ చదవండి:
ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం