ఈద్-ఉల్-ఫితర్.. నేడు బ్యాంకులకు సెలవు
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:49 AM
ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి. అయితే, కేరళలో నిన్న ఈద్ జరుపుకోవడంతో నేడు బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ముస్లింలు నేడు ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు బ్యాంకులు మూసి ఉంటాయి. నిన్న నెలవంక కనిపించడంతో నేడు (మార్చ్ 21) ఈద్-ఉల్-ఫితర్ పర్వదినాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో మార్చ్ 20న బ్యాంకులకు రంజాన్ సెలవు ప్రకటించినప్పటికీ నెలవంక దర్శనం మేరకు సెలవును మరుసటి రోజుకు మార్చాయి. అయితే, కేరళలో శుక్రవారం ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోవడంతో నేడు బ్యాంకులు యథాప్రకారం తెరిచే ఉంటాయి.
ఇక ఈ నెలలో మిగతా బ్యాంకు సెలవుల విషయానికి వస్తే శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని మార్చ్ 26న బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవును ప్రకటించింది. మార్చ్ 28 (నాల్గవ శనివారం), మార్చ్ 29 (ఆదివారం) కూడా బ్యాంకులకు సెలవే. మార్చ్ 31న మహావీర్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసే ఉంటాయి. సెలవు దినాల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎమ్ సర్వీసులు వంటివి అందుబాటులోనే ఉంటాయి.
ఈ వార్తలూ చదవండి:
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం