వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 28 , 2026 | 07:01 AM
ఈ వారం రాశిఫలాలు.. 28 జూన్ - 4 జూలై 2026 పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అనుకున్న కార్యం సఫలమవు తుంది. మీ ఊహలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. పనులు సానుకూలమవుతాయి. తరచూ బంధుమిత్రులతో సంభాషిస్తారు. అనవసర విషయాల జోలికి పోవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి చికాకుపడతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచికే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. చేసిన పనులు మొదటికే వస్తాయి. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. స్థిరాస్తి వ్యవహారంలో ఆచితూచి అడుగేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు మెరుగుపడ తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాం తరంగా ముగిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగు తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని విధాలా అనుకూలదా యకం. కార్యం సఫలమవుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. పిల్లల ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం. పొదుపుధనం గ్రహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. కొంతమొత్తం అందు తుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుం టారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. స్థిరాస్తి, వాహనం కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యం నెరవేరుతుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆదాయం ఫర్వాలేదని పిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. వివాదా స్పద విషయాల జోలికి పోవద్దు. పిల్లల ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. సన్నిహితులకు మీ సమస్య తెలియజేయండి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దఖర్చు తగులుతుంది. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలు, మధ్యవర్తులను నమ్మ వద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఒప్పందాల్లో తొందరపాటుతనం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా మొండిగా పూర్తి చేస్తారు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. ఒక సంఘ టన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. గృహంలో స్తబ్థత తొలగుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యపడదు. కార్యక్రమాలు వాయిదా వేసు కుంటారు. పిల్లలకు శుభఫలితాలున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సర్వత్రా కలిసివచ్చే సమయం. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. సమయ స్ఫూరితో మెలుగుతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారుంటారు. ప్రయాణం తలపెడతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. కీలక వివరాలు వెల్లడించవద్దు. పత్రాలు అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. తాహతుకు మించి హామీలివ్వొద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
డ్రగ్స్ స్మగ్లింగ్‌పై గతేడాది 1.48లక్షల కేసులు
పరిపాలన సిబ్బంది కోసం 297 ఆధునిక గృహాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News