ముత్యపు కవచంలో మలయప్ప
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:00 AM
తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం రెండవ రోజైన శనివారం కనులపండువగా జరిగింది. తొలిరోజు వజ్ర కవచంలో..
రెండో రోజూ కనులపండువగా జ్యేష్టాభిషేకం
తిరుమల, జూన్ 27(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం రెండవ రోజైన శనివారం కనులపండువగా జరిగింది. తొలిరోజు వజ్ర కవచంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామి రెండో రోజు సాయంత్రం ముత్యపు కవచాన్ని ధరించి నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. చివరిరోజైన ఆదివారం మలయప్పస్వామి తిరిగి స్వర్ణ కవచాన్ని ధరించి దర్శనమిస్తారు. తిరిగి వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం వరకు స్వామి ఈ స్వర్ణ కవచంలోనే ఉంటారు. టీటీడీ జీయర్‌స్వాములు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.