Share News

కాకినాడలో ఎస్‌ఏఎఫ్‌ ఉత్పత్తి కేంద్రం

ABN , Publish Date - Jun 28 , 2026 | 06:31 AM

దుబాయ్‌కు చెందిన ఎస్‌ఏఎఫ్‌ వన్‌ ఇండియా ఎస్పీ కాంపాక్ట్‌ సంస్థకు కాకినాడలో 45 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాకినాడలో ఎస్‌ఏఎఫ్‌ ఉత్పత్తి కేంద్రం

  • 1835 కోట్లతో ఏర్పాటు... 7500 మందికి ఉపాధి

  • వన్‌ ఇండియా ఎస్పీ కాంపాక్ట్‌కు 45 ఎకరాలు కేటాయింపు

అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): దుబాయ్‌కు చెందిన ఎస్‌ఏఎఫ్‌ వన్‌ ఇండియా ఎస్పీ కాంపాక్ట్‌ సంస్థకు కాకినాడలో 45 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.1835 కోట్లతో సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ (ఎస్‌ఏఎఫ్‌) ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ దుబాయ్‌కు చెందిన ఎస్‌ఎఎఫ్‌ ఎస్పీ కాంపెక్ట్‌ సంస్థ ప్రతిపాదించింది. ఈ పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 7500 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. ఏవియేషన్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు దీర్ఘకాల లీజు కింద భూమిని కేటాయించాలని ఎస్‌ఎఎఫ్‌ ఎస్పీ కాంపెక్ట్‌ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కాకినాడ మారిటైమ్‌ బోర్డుకు చెందిన 45 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 28 , 2026 | 06:33 AM