Share News

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?

ABN , Publish Date - Jul 05 , 2026 | 07:12 AM

ఈ వారం రాశిఫలాలు.. 05-07-2026 (పి.ప్రసూనారామన్‌)

వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?
Weekly Horoscope

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

mesham.jpgసర్వత్రా కలిసివచ్చే సమయం. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. నోటీసులు అందుకుంటారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వేడుకకు హాజరవుతారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgకార్యసిద్థి వ్యవహారజయం ఉన్నాయి. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు. యత్నాలకు అయినవారి ప్రోత్సాహం ఉంటుంది. పనులు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు

సంmithunam.jpgప్రదింపులు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్‌ సంస్థల్లో మదుపు తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యేసవలు అవసరమవుతాయి. ఆత్మీయుల రాక ధైర్యాన్నిస్తుంది.


కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgప్రతికూలతలు అధికం. ఏ పని చేపట్టినా మొదటికే వస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమనస్కంగా గడుపుతారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. గృహ మార్పు అనివార్యం. కనిపించకుండాపోయిన వస్తువులు లభ్యమవుతాయి.


సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

simham.jpgకార్యసాధనకు ఓర్పుతో శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. చీటికిమాటికి అసహనం చెందుతారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు

kanya.jpgఅన్ని విధాలా అనుకూలం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి.


తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgకొత్తపరిచయాలేర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సన్నిహితుల రాక సంతోషం కలిగిస్తుంది. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgపరిస్థితులు అనుకూలిస్తాయి, నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు, మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది, పత్రాలు అందుకుంటారు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgకార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సాయం ఆశించవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అనవనసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. కొత్త సమస్య తలెత్తే ఆస్కారం ఉంది. సామరస్యంగా మెలగండి. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఆచితూచి అడుగేయాల్సిన సమయం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అయినవారే మీ వైఖరిని తప్పుపడతారు. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఏ పనీ చేయబుద్థి కాదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgగ్రహస్థితి అనుకూలంగా ఉంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అసూయ కలిగిస్తుంది. వ్యాఖ్యలు, విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు పురమాయించవద్దు.


మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమర్థతను చాటుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. అనుకోని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దూరపు బంధువుతో సంభాషిస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు.


ఈ వార్తలు కూడా చదవండి:

జనం విజ్ఞతకు జగన్‌ పరీక్ష!

బంగారు కానుకలను కరిగించి.. బిస్కట్లుగా మార్చి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 07:19 AM