Share News

నా కొడుకు బూడిద ఇవ్వండి... లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:02 AM

‘‘నా కొడుకు బూడిదను ఇప్పించండి. కర్మకాండలు చేసుకుంటా. లేకపోతే నడిరోడ్డు మీద నిలబడి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటా’’ అని..

నా కొడుకు బూడిద ఇవ్వండి... లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా

  • నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు

  • రౌడీషీటర్‌ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణ

విజయవాడ, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘‘నా కొడుకు బూడిదను ఇప్పించండి. కర్మకాండలు చేసుకుంటా. లేకపోతే నడిరోడ్డు మీద నిలబడి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటా’’ అని రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హెచ్చరించారు. సాయికృష్ణ అదృశ్యంపై విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం మేజిస్టీరియల్‌ విచారణ జరిగింది. ఈ విచారణకు ఆమెతో పాటు సోదరి కనకదుర్గ, సోదరులు ముళ్లపూడి నాగేశ్వరరావు, నవరంగ్‌ హాజరయ్యారు. అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడ్ని ఎవరు, ఎందుకు చంపారో, దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. కుమారుడి కోసం పోరాటం చేస్తుంటే తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. సిట్‌ స్వాధీనం చేసుకున్న ఎముకలు, బూడిద సాయికృష్ణవేనని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. సీఐ నాగరాజు ఎంతోమందిని చంపేశారని ఆమె ఆరోపించారు. సాయికృష్ణ పవన్‌ కల్యాణ్‌ అభిమాని అన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 06:02 AM