Share News

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:22 PM

బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు.

బాలికను వేధించిన వైసీపీ కార్యకర్త అరెస్ట్‌

హిందూపురం(అనంతపురం): బాలికను లైంగికంగా వేధించి, బెదిరించిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు వివరాలను సీఐ ఆంజనేయులుతో కలిసి డీఎస్పీ మహేష్‌ గురువారం వెల్లడించారు. హిందూపురం(Hindupuram) మండలం కె.బసవనపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త గోవర్ధన్‌ ఈనెల 11న రాత్రి 14ఏళ్ల బాలిక ఇంటివద్దకు వెళ్లి ద్విచక్రవాహనంపై రావాలని ఒత్తిడి చేశాడు. ఆ బాలిక నిరాకరించడంతో చంపేస్తానని బెదిరించి, తీసుకెళ్లి శారీరకంగా వేధించాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారిని గుర్తించి బాలిక సాయం కోరింది. దీంతో వారు బాలికను కాపాడారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెబితే మీ అంతు చూస్తానని బెదిరించాడు. కానీ బాధితురాలు, ఆమె తల్లి అప్‌గ్రేడ్‌ పోలీస్‏స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


pandu2.2.jpgదీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గోవర్ధన్‌ను అరెస్ట్‌ చేశారు. ఇతడిపై కిడ్నాప్‌, అత్యాచారయత్నం, పోక్సోకేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు వైసీపీలో క్రియాశీలకంగా ఉంటూ జులాయిగా తిరిగేవాడన్నారు. ఇటీవల చిలమత్తూరు మండలానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిందని, అందులో ఉన్నది బాలిక కాదని, 20ఏళ్లుపైబడిన మహిళ అని తెలిపారు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారమన్నారు. బాలిక అయి ఉంటే సుమోటోగా తామే కేసు నమోదు చేసి ఉండేవారమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్‌ ప్లాంట్‌

మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2026 | 01:22 PM