Share News

నీలి కొంగకు తప్పని బెంగ..!

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:17 PM

విజయనగర జిల్లా, హగరిబొమ్మనహళ్ళి తాలూకా, మాలవి జలాశయం తీర ప్రాంతాల్లో విదేశీ డెమోసెల్‌ క్రేన్‌ (క్రౌంచ్‌) పక్షులు సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం వేలాది పక్షులు ఈ ప్రాంతానికి రావడం గమనార్హం.

నీలి కొంగకు తప్పని బెంగ..!

  • వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్న పక్షులు

బళ్లారి(బెంగళూరు): విజయనగర జిల్లా, హగరిబొమ్మనహళ్ళి తాలూకా, మాలవి జలాశయం తీర ప్రాంతాల్లో విదేశీ డెమోసెల్‌ క్రేన్‌ (క్రౌంచ్‌) పక్షులు సందడి చేస్తున్నాయి. ఆహారం కోసం వేలాది పక్షులు ఈ ప్రాంతానికి రావడం గమనార్హం. ఆ దక్షిణ భారత దేశంఓ మొదటి సారిగా అతి ఎక్కువ పక్షులు ఈ ప్రాంతంలో సేద దీరడం విశేషంగా పక్షి ప్రేమికులు భావిస్తున్నారు. జలాశయంలోని తడి భూములు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. అవి ఈ పక్షులకు ఆహార ప్రదేశంగా మారుతుండడం విశేషం. వ్యవసాయ భూములు, ఒడ్డున అవి గూడు కట్టుకునే అవకాశం ఉంది.


అయితే మత్స్య కారులు నీటి గుంతలు దగ్గర వలలు వేయడం, కుక్కలు ముప్పు కారణంగా ఈ అరుదైన పక్షులు ప్రమాదంలో పడుతున్నాయని స్థానిక పక్షి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఈ అపురూపమైన పక్షులు మంగోలియా, సౌబీరియా నుండి హిమాలయాల మీదుగా ఏటా ఈ ప్రాంతానికి వలసలువస్తుయి. శీతాకాలంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కనిపించే ఈ అపురైమైన పక్షులు 2020లో ఈ ప్రాంతంలో చాలా అరుదగా కనిపించాయి. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకోవడంతో ఈ ప్రాంతం అందంగా తయారయ్యింది. ఇలాంటి అపురూపమైన పక్షులను రక్షించి సంరక్షించాల్సిన అవసరం ఉందని పక్షులు నిపుణులు విజయ్‌ ఇట్టగి అభిప్రాయ పడుతున్నారు.


pandu1.2.jpgఇలాంటి సున్నితమైన పక్షులు ఆహారం ఉన్న ప్రాంతంలో మనుషులు, పశువులు, కుక్కలు వంటి ఏ జంతువునైనా చూసినా నేలపైకి దిగవు. వలస పక్షులను రక్షించడానికి అటవీశాఖ కనీసం కొన్ని నెలల పాటు రిజర్వాయర్‌ దగ్గర గార్డులను నియమించాలని స్థానిక పక్షి ప్రేమికులు అధికారులను అభ్యర్థిస్తున్నారు. సాధారణంగా తెలుగులో ఈ పక్షిని నీలికొంగగా పిలుస్తారు. శరీరం ప్రధానంగా బూడిద-నీలం రంగులో ఉంటుంది. ఇవి సాధారణంగా గడ్డిమైదానాలు, విశాలమైన పొలాలు, నీటి ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడుతాయి. ఆసియా, యూరఫ్‌ ప్రాంతాల్లో ఎక్కువగా కనపించే ఇలాంటి పక్షులు శీతాకాంలో భారత్‌కు వలసగా వస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

కుప్పంలో ప్రపంచ స్థాయి న్యూట్రిషన్‌ ప్లాంట్‌

మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 20 , 2026 | 12:17 PM