మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
ABN , Publish Date - Feb 20 , 2026 | 10:50 AM
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నడుమ శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే, డాలర్ బలపడటంతో ధరల పెరుగుదల ఓ మోస్తరు స్థాయికే పరిమితమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత్‌లో కూడా పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 10.00 గంటల సమయంలో ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1.53 లక్షల మార్కు వద్ద తచ్చాడుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.2.43 లక్షలకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ మేలిమి బంగారం స్పాట్ ధర 5,010 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌కు డిమాండ్ బలంగా ఉండటంతో లోహాల ధరల్లో పెరుగుదల ఓ మోస్తరుగానే ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి (Gold, Silver Rates on Feb 20).
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం స్పాట్ ధర రూ.1,56,170గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,150 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2.7 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,57,310గా, ముంబైలో రూ.1,56,170గా ఉంది. ఈ రెండు నగరాల్లో వెండి రేటు రూ.2.7 లక్షల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే. బంగారం ధరలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అంతేకాదు, నగరాన్ని బట్టి, మేకర్/జ్యువెలర్ ఆధారంగా కొద్దిగా తేడా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం స్థానిక బంగారు షాపులతో పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ వార్తలూ చదవండి: