యువకుడి ప్రాణాలు తీసిన రీల్స్ మోజు
ABN , Publish Date - Apr 22 , 2026 | 07:40 AM
యువత రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీకి చెందిన మిథున్ (14) ఏప్రిల్ 5న తన బిల్డింగ్ నాల్గవ అంతస్తులో స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ తీసుకుంటుంగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
హైదరాబాద్: యువత రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీకి చెందిన మిథున్ (14) ఏప్రిల్ 5న తన బిల్డింగ్ నాల్గవ అంతస్తులో స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ తీసుకుంటుంగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు. కాగా ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:
అల్లు అర్జున్‌కు ఊరట.. ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Read Latest Telangana News and National News