Share News

ట్రేడింగ్‌ పేరిట రూ.4.27 కోట్లకు బురిడీ

ABN , Publish Date - Nov 28 , 2026 | 10:10 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ రిటైర్డ్‌ ఉద్యోగి నుంచి రూ. 4.27 కోట్లు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు.

ట్రేడింగ్‌ పేరిట రూ.4.27 కోట్లకు బురిడీ
Cyber Crime

  • రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అధిక లాభాలంటూ రిటైర్డ్‌ ఉద్యోగి నుంచి రూ. 4.27 కోట్లు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు. ఏఎస్ రావు నగర్‌కు చెందిన తూములూరి ప్రసాదరావు రిటైర్డ్‌ ఉద్యోగి. ఈ ఏడాది ఆగస్టు 5న సోనాల్‌ జగన్నాథ్‌ నాయక్‌ అనే మహిళ ఆయనకు ఫోన్‌ చేసింది. ముంబైకి చెందిన జూలియస్‌ బేర్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వయిజర్‌నని పరిచయం చేసుకుంది. తాము సూచించిన కంపెనీల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది.


city4.2.jpgప్రసాదరావును సీ75 జూలియస్‌ బేర్‌ ఇన్వెస్టర్‌ ఎలైట్‌ అనే వాట్సాప్‌ గ్రూపులో చేర్పించింది. తర్వాత ఆ కంపెనీ హెడ్‌, ట్రేడింగ్‌ ఎక్స్‌పర్ట్‌ అంటూ కునాల్‌ సమయా అనే వ్యక్తి ప్రసాదరావుతో ఫోన్‌లో మాట్లాడి మరింత నమ్మించాడు. వారి మాటలు నమ్మిన ఆయ న తొలిరోజే రూ.1.50లక్షలు పెట్టుబడి పెట్టగా లాభం చూపించారు. దీంతో ప్రసాదరావు ఒకే రోజు రూ. 89 లక్షలు పెట్టుబడిగా పంపారు.


ఆగస్టు 5 నుంచి నవంబరు 3వ తేదీ వరకు 28 లావాదేవీల ద్వారా రూ.4.27కోట్లను సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ప్రసాదరావు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టి ప్రసాదరావు ఖాతా నుంచి బదిలీ అయిన నగదు 11 వేర్వేరు రాష్ట్రాల్లోని 20 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్టు గుర్తించారు. ఆ ఖాతాల నుంచి దాదాపు 1000 ఖాతాలకు బదిలీ అయ్యిందని, ఆదేరోజు గంటల వ్యవధిలోనే నగదు విత్‌డ్రాలు జరిగాయని కనుగొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 10:10 AM