Share News

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Mar 21 , 2026 | 07:04 AM

తల్లితో గొడవపడిన ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పిల్లి విషయంలో తల్లితో గొడవ.. ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: తల్లితో గొడవపడిన ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిసాలబజార్‌ ఫ్రైడ్‌ అపార్ట్‌మెంట్‌ నివసించే తుమ్మల ప్రిన్సి (శ్రేష్ట) (23) ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ చదవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మొదటినుంచి తల్లి కుసుమలత(Kusumalatha)తో చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతుండేది. అయితే, తాజాగా శ్రేష్ట ఇంటికి ఓ పెంపుడు పిల్లిని తీసుకువచ్చింది. నాటినుంచి ఇంట్లో గొడవలు తీవ్రమయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్రేష్ట శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి కుసుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


city2.3.jpgటెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య..

సుభాష్‏నగర్‌ ద్వారకాపురి కాలనీలో నివసించే ప్రణీత్‌గౌడ్‌ (15) కానాజిగూడలో సెయింట్‌ అండ్రూస్‌ స్కూల్‌లో చదువుతున్నాడు. తాజాగా నిర్వహించిన సీబీఎస్ఈ పదవతరగతి పరీక్షలు రాశాడు. నాటినుంచి పరీక్షలు సరిగా రాయలేదనే మానసిక వ్యధకు లోనయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

సుప్రియకు అండగా దాతలు

తెలంగాణకే ఐఏఎస్‌ వాణిప్రసాద్‌: డీవోపీటీ ఉత్తర్వులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2026 | 08:21 AM