Share News

రెండు వాహనాలకు ఒకే నంబర్‌ ప్లేట్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 09:42 AM

హైదరాబాద్ నగరంలోని బోరబండకు చెందిన నారాయణరెడ్డి రెండు(హోండా యాక్టివా స్కూటర్లు) వాహనాలకు ఉద్దేశపూర్వకంగా ఒకే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను పెట్టుకున్నట్లు పోలీసులు తనిఖీల్లో గుర్తించారు.

రెండు వాహనాలకు ఒకే నంబర్‌ ప్లేట్‌

  • బోరబండలో వ్యక్తిపై కేసు నమోదు

హైదరాబాద్‌ సిటీ: బోరబండకు చెందిన నారాయణరెడ్డి రెండు(హోండా యాక్టివా స్కూటర్లు) వాహనాలకు ఉద్దేశపూర్వకంగా ఒకే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను పెట్టుకున్నట్లు పోలీసులు తనిఖీల్లో గుర్తించారు. నిందితుడు తన హోండా యాక్టివా వాహనానికి టీఎస్ 09జీడీ2712 అనే నంబర్‌ ప్లేట్‌ను అమర్చడంతో కేసు నమోదు చేశారు. వాస్త వానికి ఈ నంబర్‌ నిందితుడి కుమార్తె దీపారాణి పేరిట ఉన్నది. ఆ బండి కూడా హోండా యాక్టివా స్కూటరే. చలానాల నుంచి తప్పించుకోవడానికే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది.


నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినా, ఒకే నంబర్‌ ప్లేట్‌ను రెండు వాహనాలకు వినియోగించినా చర్యలు తప్పవని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌ హెచ్చరించారు. దీనిపై మంగళవారం ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్ల దుర్వినియోగానికి సంబంధించి పౌరులు 8712661690 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం

దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 15 , 2026 | 09:42 AM