Share News

ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:59 AM

తెలంగాణ డీజీపీ (హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) పదవి చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లను యూపీఎస్సీ సిఫార్సు చేసిందని...

ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం

  • ముగ్గురు ఐపీఎస్‌ల పేర్లు సిఫార్సు చేసిన యూపీఎస్సీ

  • హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్‌ జనరల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డీజీపీ (హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) పదవి చేపట్టడానికి అన్ని అర్హతలు ఉన్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లను యూపీఎస్సీ సిఫార్సు చేసిందని, అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల పేర్లు ప్రస్తుతానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డిని తాత్కాలికంగా నియమించారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాత్కాలిక నియామకాలు చెల్లవని పేర్కొంటూ టీ ధనగోపాల్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. మరోవైపు అన్ని అర్హతలు ఉన్న సీవీ ఆనంద్‌, వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యామిశ్రాల పేర్లను యూపీఎస్సీ సిఫార్సు చేసింది. వీరిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుత డీజీపీ పదవీకాలం ఈనెల 30 వరకు ఉంది. ఆయన పదవీకాలం ముగిసేలోపు ప్రభుత్వం కొత్త డీజీపీని ఎంపిక చేసే అవకాశం ఉంది. శివధర్‌రెడ్డిని మధ్యలో తొలగించకుండా గౌరవప్రదంగా రిటైర్‌ అయ్యేలా ప్రభుత్వం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Apr 15 , 2026 | 04:59 AM